విద్యార్థులకు పోలీసు ఆయుధాలపై అవగాహన

ABN , First Publish Date - 2021-10-28T06:08:16+05:30 IST

స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో పోలీ సు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న ఓపెన హౌస్‌ బుధవారం ముగిసింది.

విద్యార్థులకు పోలీసు ఆయుధాలపై అవగాహన
గుంతకల్లు జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో ఓపెన హౌస్‌

గుంతకల్లు, అక్టోబరు 27: స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో పోలీ సు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కొనసాగుతున్న ఓపెన హౌస్‌ బుధవారం ముగిసింది. విద్యార్థులకు పోలీసు ఆయుధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రామాంజనేయులు, ఎస్‌బీ ఎస్‌ ఐ సురేశ, ఏఆర్‌ ఎస్‌ఐ బీ వెంకటరమణ, ఏఎ్‌సఐ గోపి, హెచసీ వై రెడ్డి, పీసీ దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు. 


పామిడి: స్థానిక పోలీసుస్టేషనలో బుధవారం విద్యార్థులకు పోలీసు ఆ యుధాలపై సీఐ ఈరన్న అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చాంద్‌బాషా, ఏఎ్‌సఐ మధుసూదన రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ ఇజ్రాయిల్‌, కానిస్టేబుల్‌ జయచంద్ర నాయుడు పాల్గొన్నారు. 


తాడిపత్రి టౌన: పట్టణ పోలీ్‌సస్టేషనలో ఓపెనహౌ్‌స కార్యక్రమం బు ధవారం రెండవరోజు కొనసాగింది. మహిళా ఎస్‌ఐ లక్ష్మి పోలీసు రికార్డుల నిర్వహణ, దిశ యాప్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 


కణేకల్లు: స్థానికంగా బుధవారం ఎస్‌ఐ దిలీ్‌పకుమార్‌ ఆధ్వర్యంలో పో లీసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రామ్‌నగర్‌ నుంచి వైఎస్సార్‌ సర్కిల్‌ వరకు చేపట్టిన ర్యాలీలో హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీరాములు, పోలీసు సిబ్బంది, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: పోలీస్‌ అమరవీరుల త్యాగాలు వృథాకావని ఇనచార్జ్‌ డీ ఎస్పీ అంతోనప్ప పేర్కొన్నారు. బుధవారం రాత్రి పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో కలిసి టీసర్కిల్‌లో మానవహారంగా ఏ ర్పడ్డారు. విధినిర్వహణలో పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్‌, తేజోమూర్తి, ఎస్‌ఐ ఆశాబేగం పాల్గొన్నారు. 


ఉరవకొండ: పట్టణంలో బుధవారం డీఎస్పీ నరసింగప్ప ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి పోలీ సు అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు రమే్‌షరెడ్డి, గోపాలుడు, వెంకటస్వామి, వెంకటరవి కిరణ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T06:08:16+05:30 IST