Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్‌పై అవగాహన అవసరం

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌


అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 3: ఒమైక్రాన్‌ వైరస్‌పై ప్రజలకు అవగాహన అవసరమని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. కొవిడ్‌ బాదిత కుటుంబాలకు పోషకాహార, నిత్యావసర వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా బాధిత కుటుంబాలకు చేయూతనిస్తున్నామన్నారు. ఒమైక్రాన్‌ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీవోలు సువార్త, రత్నకుమారి, ఎంపీపీ గొర్లి సూరిబాబు, జడ్పీటీసీ సభ్యులు భీశెట్టి సత్యవతి, దంతులూరి శ్రీధర్‌రాజు, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్‌కుమార్‌,  మందపాటి జానకిరామరాజు, పలకా రవి, జాజుల రమేశ్‌, కొణతాల మురళీకృష్ణ, సకల గోవింద్‌ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement