చట్టాలపై అవగాహన కల్పించాలి : జడ్జి శ్రీదేవి

ABN , First Publish Date - 2021-03-04T06:29:22+05:30 IST

చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయవాదులు, ఉపాధ్యాయులపై ఉందని కోదాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి అన్నారు.

చట్టాలపై అవగాహన కల్పించాలి : జడ్జి శ్రీదేవి
మాట్లాడుతున్న జడ్జి శ్రీదేవి

కోదాడ టౌన్‌, మార్చి 3: చట్టాలపై మహిళలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత న్యాయవాదులు, ఉపాధ్యాయులపై ఉందని కోదాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి అన్నారు. కోదాడ కోర్టు ఆవరణలో దేశ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల ఉత్తర్యుల మేరకు, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని మహిళా చట్టాలపై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో మహిళలకు ఇబ్బంది వచ్చినప్పడు దగ్గరలోని అంగన్‌వాడీలను, ఆశా కార్యకర్తలను ఆశ్రయిస్తే, లాయర్ల సహకరంతో సమస్యల పరిష్కరానికి వారు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో లాయర్లు శరతబాబు, శ్రీనివాసులు, వీరభద్రం, వెంటేశ్వర్లు, రాజన్న, నాగరాజు, చలం, రహీం, దుర్గ, ఆశాకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-04T06:29:22+05:30 IST