చట్టాలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-26T04:32:04+05:30 IST

చట్టాలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికారులను ఆదేశించారు.

చట్టాలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 


వనపర్తి అర్బన్‌, మే 25: చట్టాలు, బాలికల సంరక్షణపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ సమావేశ మంది రంలో బాలికల సంరక్షణ, చట్టాలపై అవగాహన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, బాల కార్మికుల నిర్మూలన, బాల్య వివాహాల నిషేధం వంటి తదితర విషయాలపై చర్యలు చేపట్టాలని, బాలికలకు పూర్తి రక్షణ కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. చందాపూర్‌ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్క గ్రామం అన్ని రంగాల్లో ప్రగతి సాధించాలని ఆమె ఆకాంక్షించారు. సీడబ్ల్యూసీ చైర్మన్‌ అలివేలమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, తప్పిపోయిన పిల్లలను, బడి మధ్యలో మానేసిన పిల్లలను గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని, బాలకార్మిక నిర్మూలనకు కృషి చేయాలని అన్నారు. చట్టంలోని నిబంధనల ప్రకారం ఎప్పటికప్పుడు వారికి రక్షణ కల్పిస్తు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి, బాలికల సంరక్షణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిషే ధం వంటి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించా లని ఆమె కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్‌హుస్సేన్‌, డీడబ్ల్యూవో అధికారి పుష్పలత, డీఈవో రవీందర్‌, సీడబ్ల్యూసీ చైర్మన్‌ అలివేలమ్మ, సీడీపీవోలు, జిల్లా అధికారులు, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.  




Updated Date - 2022-05-26T04:32:04+05:30 IST