Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరుతడి పంటలపై అవగాహన

శంషాబాద్‌ రూరల్‌ : శంకరపురంలో రైతులకు అవగాహన కల్పిస్తున్న జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి అవగాహన

  • వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి 
  • రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు

శంషాబాద్‌ రూరల్‌/ఆమనగల్లు/తలకొండపల్లి/చేవెళ్ల/యాచారం/ నందిగామ/కందుకూరు/మహేశ్వరం : రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి రైతులకు సూచించారు. బుధవారం శంషాబాద్‌ మండలం శంకరపురంలో ఆరుతడి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వ సూచనల మేరకు వరికి బదులుగా కూరగాయలు సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే ఆరుతడి పంటలను సాగుచేయాలని సూచించారు. యాసంగిలో పండించే పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయదని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ లీనా, ఏవో కవిత, రాఘవేందర్‌, పంచాయతీ కార్యదర్శి నళిని, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి మహేశ్వరం మండలంలోని మన్‌సాన్‌పల్లి గ్రామంలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడుతూ.. యాసంగిలో వరి పంటను సాగుచేయకూడదని, అందుకు బదులుగా ఇతర లాభసాటి పంటలైన నూనె గింజలు, కూరగాయలు, పూల సాగు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో  సర్పంచ్‌ కంది అరుణ రమేష్‌తో పాటు అధికారులు, రైతులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆరుతడి పంటల సాగు రైతులకు అన్ని విధాల శ్రేయోదాయకమని ఆమనగల్లు మండల వ్యవసాయ శాఖ అధికారి అరుణకుమారి, సర్పంచ్‌లు గోదాదేవి సత్యం, బాల్‌రామ్‌, మల్లమ్మ, ఎంపీటీసీ దోనాదుల కుమార్‌లు అన్నారు. ఆమనగల్లు మండలం శెట్టిపల్లి, పోలెపల్లి, కోనాపూర్‌, జంగారెడ్డి పల్లి, చంద్రాయన్‌పల్లి తండాలలో ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాణి, సాయిరామ్‌, శివతేజ, మౌన్య, నాయకులు రైౖతులు పాల్గొన్నారు. కాగా, తలకొండపల్లి మండలం గౌరిపల్లి, రాంపూర్‌, నల్లరాళ్ల తండా, తిమ్మాపూర్‌, దేవునిపడకల్‌, మెదక్‌పల్లి గ్రామాలలో ఆరుతడి పంటల సాగుపై ఏవో రాజు రైతులకు అవగాహన కల్పించారు. అలాగే రైతులు సంప్రదాయ పంటలను సాగు చేసుకోవాలని చేవెళ్ల మండల విస్తరణాధికారి రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. చేవెళ్ల మండలం ఆలూర్‌, తలారం, తదితర గ్రామాల్లో పంటల సాగుపై అవగాహన కల్పించారు. రైతులు ప్రభుత్వం సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. కార్యక్రమంలో రైతులు తదితరులు ఉన్నారు. కాగా, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని యాచారం మండల వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్‌ రైతులకు సూచించారు. తాడిపర్తి. నానక్‌నగర్‌ తదితర గ్రామాల్లో  పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. వరికి బదులు పెసర, కంది, మినుము. పొద్దుతిరుగుడు, శనగ తదితర పంటలను పండించాలని రైతులకు సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందించనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అలాగే యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై నందిగామ మండలం చేగుర్‌ గ్రామంలో రైతులకు వ్యవసాయశాఖ ఏఈవో రవినాయక్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యాసంగి పంటల బ్రోచర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ మామిళ్ల విఠల్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.  అలాగే ఆరుతడి పంటలు సాగు చేసుకోవడం ద్వారా భూగర్భజలాన్ని కాపాడుకోవచ్చని కందుకూరు మండల వ్యవసాయాధికారి యాదగిరి రైతులను కోరారు. బుధవారం మండల పరిధిలోని నేదునూరు, ఆకులమైలారం, జైత్వారం, సాయిరెడ్డిగూడ, తదితర గ్రామాలలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. కూరగాయల సాగుపై చొరవ తీసుకోవాలని, వరి పంట వేయరాదని, రాష్ట్ర ప్రభుత్వ సూచనను రైతులు పాటించాలన్నారు. కార్యక్రమాలలో వ్యవసాయ విస్తరణాధికారులు అర్చన, రాఘవేందర్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement