వ్యాక్సిన్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ

ABN , First Publish Date - 2021-04-13T06:08:40+05:30 IST

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకుని కొవిడ్‌ నుంచి రక్షణ పొందాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అన్నారు.

వ్యాక్సిన్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ
మాస్కు ధరించని వాహనదారులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ

కొవ్వూరు, ఏప్రిల్‌ 12 : ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకుని కొవిడ్‌ నుంచి రక్షణ పొందాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అన్నారు. రెవిన్యూ డివిజన్‌ పరిధిలో ఇప్పటివరకు 44,048 మందికి వ్యాక్సిన్‌ అందజేశామన్నా రు. 45 నుంచి 59 ఏళ్ల వారు 19,593 మంది, 60 ఏళ్లు పైబడిన వారు 24,455 మందికి వ్యాక్సిన్‌ అందించడం జరిగిందన్నారు. వ్యాక్సిన్‌పై అపోహ లు విడనాడాలన్నారు. తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలన్నారు. చేతులను తరచుగా శుభ్రపరచుకోవాలని, శానిటైజర్లు వినియోగించాలన్నారు.


కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

కొవిడ్‌ నిబంధనలను ప్రతీ ఒక్కరూ పాటించాలని ఎస్‌ఐ ఆనందరెడ్డి అన్నారు. పట్టణంలో సోమవారం వాహన దారులను తనిఖీ చేసి మాస్కులు ధరించని వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి జరిమానాలు విధించారు. ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చేటప్పుడు మాస్కు లు ధరించాలన్నారు. కొవిడ్‌ ఉదృతి పెరుగుతున్న దృష్టా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి సహకరించాలని కోరారు.


ప్రభుత్వాసుపత్రులలో వ్యాక్సిన్‌ కొరత

జంగారెడ్డిగూడెంలో కరోన వ్యాక్సిన్‌ అందుబాటులో లేదు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో సోమవారం  120 మందికి, తాడువాయి పీహెచ్‌సీ పరిధిలో 20, తాడువాయి పీహెచ్‌సీ పరిధిలో 20 మందికి వ్యాక్సిన్‌ వేశారు. వ్యాక్సిన్‌ లేకపోవడంతో తాత్కాలికం గా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిలిచిపోయింది. మరలా ఒకటి, రెండు రోజుల్లో వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే ప్రజలకు అందించనున్నారు.

Updated Date - 2021-04-13T06:08:40+05:30 IST