కరోనాపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2020-04-04T09:41:08+05:30 IST

దేశ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిని తరమికొట్టేందుకు ప్రజలను మరింత

కరోనాపై అవగాహన కల్పించాలి

టీపీఆర్‌ఎంఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల నందకుమార్‌ 


వికారాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి) : దేశ వ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా మహమ్మారిని తరమికొట్టేందుకు ప్రజలను మరింత చైతన్య పరిచే దిశగా పంచాయతీరాజ్‌ ఉద్యోగులు వలంటీర్లుగా తమ వంతు కృషి చేయాలని తెలంగాణ పంచాయతీరాజ్‌ మినిస్ట్రీరియల్‌ ఉద్యోగుల సంఘం (టీపీఆర్‌ఎంఈఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల నందకుమార్‌ పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు రోడ్లపైకి వచ్చే ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలని సూచించారు.


ప్రతి ఉద్యోగి తమకు తోచిన సహాయాన్ని అందజేస్తే రాష్ట్ర సంఘం సేకరించి డీడీ రూపంలో సీఎంకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 5న రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లు ఆఫ్‌చేసి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించి కరోనాను తరిమికొట్టేందుకు మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-04-04T09:41:08+05:30 IST