అరటితోటలో తెగుళ్లపై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2022-08-07T06:50:06+05:30 IST

బేస్తవారపేట మండలంలోని సోమవారపేట గ్రామంలోని ఆరటితోటల యాజమాన్య పద్ధతులపై శనివారం ఉద్యానశాఖ అధికారి డి.శ్వేత సోమవారపేటలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

అరటితోటలో తెగుళ్లపై రైతులకు అవగాహన
అవగాహన కల్పిస్తున్న ఉద్యానాధికారి శ్వేత


బేస్తవారపేట, ఆగస్టు 6: బేస్తవారపేట మండలంలోని సోమవారపేట గ్రామంలోని ఆరటితోటల యాజమాన్య పద్ధతులపై శనివారం ఉద్యానశాఖ అధికారి డి.శ్వేత సోమవారపేటలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ వాతావరణంలో  తేమ 90 శాతం కన్న అధికం గా ఉండి ఉష్ణోగ్రత 26 డిగ్రీలు ఉన్పప్పుడు అరటి మడులు 6 నుండి 10 గంటలు తడిగా ఉంటుందన్నారు. దీంతో ఈ తెగులు ఈజీగా సొకుతుందన్నారు.  ముందుగా ఆకులు  పసుపు రంగుమచ్చలు ఏర్పాడుతాయన్నారు. తర్వాత క్రమేపి గోదుమ రంగులోకి మారి  ఆకులు ఎండిపోతాయని అన్నారు. దీని నివారణకు తెగులు వ్యాప్తి మొదలైనప్పుడు ప్రొఫికొనజోల్‌ 1ఎంల్‌, మినరల్‌ ఆయిల్‌ 10ఎంల్‌ను లీటర్‌ నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ మందును 25 రోజుల వ్యవధిలో మూడు సార్లు, తెగులు ఉధృతి అధికంగా ఉంటే 7 సార్లు వరకు పిచికారి చేయాల్సి ఉంటుందని అన్నారు. గెలు కోయడానికి 45 రోజులు ముందుగా ఎలాంటి మందును పిచికారి చేయకుడదని రైతులకు సూచించారు. మొదటిగా ప్రొపికొనజోల్‌ లీటర్‌ నీటికి 1ఎంల్‌,రెండవసారి కార్భండిజిమ్‌,మాంకోజబ్‌ లీటర్‌ నీటికి 1గ్రాం,మూడోసారి ట్రైప్లోక్సిస్ర్టొబిన్‌,టెబ్యుకొనజోల్‌ మిశ్రమ మందు1.4 గ్రాములు పిచికారి చేయాలన్నారు.

Updated Date - 2022-08-07T06:50:06+05:30 IST