కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-04-13T07:21:49+05:30 IST

ప్రతి ఒక్కరూ కొవిడ్‌- 19 నిబంధనలను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందితో అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే అన్నారు.

కరోనా నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలి
దిలావర్‌పూర్‌లో డా. శ్యామ్‌కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న అడిషనల్‌ కలెక్టర్‌

ప్రతీ ఒక్కరికి కోవిడ్‌ టీకా వేయాలి

అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

సారంగాపూర్‌, ఏప్రిల్‌ 12 : ప్రతి ఒక్కరూ కొవిడ్‌- 19 నిబంధనలను పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందితో అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే అన్నారు. సోమ వారం మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించి వైద్యసిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ప్రతీరోజు గ్రామాలలో కరోనా పరీక్షలు నిర్వహించాలని, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌టీకాను వేసుకునేలా అవగాహన కల్పించి కోవిడ్‌టీకాను వేయా లని, వ్యాక్సిన్‌పై ప్రజలు ఎలాంటి అపోహలు లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిదే నని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లను ధరిస్తూ దూరభారంను పాటిస్తేనే కరోనాను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. ఈయన వెంట ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ తుకారాం, ఎంపీడీవో సరోజ, ఈవోపీఆర్డీ తిరుపతిరెడ్డి, డాక్టర్‌ రమేష్‌, వైద్యసిబ్బందిలు ఉన్నారు. 

కోవిడ్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించుకోవాలి

దిలావర్‌పూర్‌, ఏప్రిల్‌ 12 : నలభై ఐదు సంవత్సరాలు పైబడిన ప్రతీఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సి న్‌ వేయించుకోవాలని అడిషనల్‌ కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. దిలావర్‌పూర్‌ పీహెచ్‌సీ ని సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌, కొవిడ్‌టెస్టుల వివరాలను డా. శ్యామ్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్‌ వేసుకునేలా ఆయా గ్రామాల ఆశాలు కృషి చేయాలన్నారు. గ్రామంలో ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించేలా చూడాలని సర్పంచ్‌ వీరేష్‌కుమార్‌కు సూచించారు. అదనపు కలెక్టర్‌ వెంట ఎంపీడీవో మోహన్‌రెడ్డి, తహసీల్దార్‌ సంతోష్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-04-13T07:21:49+05:30 IST