Abn logo
Apr 16 2021 @ 23:20PM

వలంటీర్ల ఉత్తమ సేవలకు అవార్డులు

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


అనకాపల్లి, ఏప్రిల్‌ 16: వలంటీర్లు ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నందనే అవార్డులు ప్రదానం చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక రావుగోపాలరావు స్టేడియంలో శుక్రవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సాధికార సర్వే చేసిన ఘనత వలంటీర్లకే దక్కుతుందన్నారు. అనకాపల్లి అభివృద్ధికి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కరోనాను ఎదుర్కోవడానికి టీకా వేయించుకోవడం, మాస్క్‌ ధరంచడమే మార్గమన్నారు. జీవీఎంసీ మేయర్‌ హరి వెంకటకుమారి మాట్లాడుతూ, అనకాపల్లి జోన్‌ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, అనకాపల్లి పార్లమెంట్‌ పరిశీలకుడు దాడి రత్నాకర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఆర్డీవో జె.సీతారామారావు, జడ్‌పీ సీఈవో నాగార్జునసాగర్‌, జడ్‌సీ పి.శ్రీరామ్మూర్తి, తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, కార్పొరేటర్లు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement