రవాణాశాఖ ‘ఎనీ వేర్‌-ఎనీ టైమ్‌’కు అవార్డు

ABN , First Publish Date - 2021-02-25T08:02:25+05:30 IST

రాష్ట్ర రవాణా శాఖ అమలు చేస్తున్న ‘ఎనీవేర్‌-ఎనీ టైమ్‌’ సేవలకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్సలెన్సీ అవార్డు లభించింది.

రవాణాశాఖ ‘ఎనీ వేర్‌-ఎనీ టైమ్‌’కు అవార్డు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రవాణా శాఖ అమలు చేస్తున్న ‘ఎనీవేర్‌-ఎనీ టైమ్‌’ సేవలకు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్సలెన్సీ అవార్డు లభించింది. బుధవారం జరిగిన వర్చువల్‌ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు ఈ అవార్డును స్వీకరించారు. డ్రైవింగ్‌ లైసెన్సు రెన్యువల్‌, డూప్లికేట్‌  లైసెన్సు, చిరునామా మార్పు, బ్యాడ్జి, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు తదితర 17 రకాల సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినందుకు గాను ఈ అవార్డు లభించింది. 

Updated Date - 2021-02-25T08:02:25+05:30 IST