Abn logo
Sep 19 2021 @ 00:43AM

గోపులాపురం రైతుకు అవార్డు

అవార్డు అందుకుంటున్న రైతు గోపులాపురం బసవరాజు

కణేకల్లు, సెప్టెంబరు 18: మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన యువ రైతు, మాజీ సర్పంచ గరికపాటి బసవరాజుకు రాష్ట్రస్థాయి ఉత్తమ రైతు అవార్డు లభించింది. శనివారం హైదరాబాద్‌లోని అమితసింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన ఆధ్వర్యంలో హార్టికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పద్మలత, అసిస్టెంట్‌ డైరక్టర్‌ సతీష్‌, ఎనజీ రంగా విశ్వవిద్యాలయ వీసీ ప్రవీణ్‌రావు, బీజేపీ ఎంపీ వీఎల్‌ నరసింహారావు.. బసవరాజుకు అవార్డును అందజేశారు. మైక్రో ఇరిగేషన ద్వారా ఉ ద్యాన పంటలు పండించినందుకు ఉద్యానవనశాఖ, జైన డ్రిప్‌ కంపెనీ సంయుక్తంగా బసవరాజును ఉత్తమ రైతుగా ఎంపిక చేశాయి.