పురస్కారం స్వీకరిస్తున్న విద్యార్థి
ఆకివీడు రూరల్, మే 19: అయిభీమవరంలోని టీటీడీ వేద పాఠశాల విద్యార్థులు మైసూర్ దత్తపీఠంలో నిర్వహించిన పోటీ లలో శుక్ల యజుర్వేదంలో విశేష ప్రతిభ కనబర్చారు. శుక్ల యజు ర్వేదం క్రమాంతంలో నలుగురు, ఘనలో ఒకరు, సామవేదంలో ఒకరు, మైసూరు దత్తపీఠం విజయానందతీర్థ స్వామీజీ నుంచి పురస్కారం అందుకున్నారని ప్రిన్సిపాల్ లింగాల సత్యనారాయణమూర్తి తెలిపారు. దేశం నలుమూలలు నుంచి వంద మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారన్నారు.