కరోనాపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-17T05:49:20+05:30 IST

కరోనా వైరెస్‌ రోజురోజుకు విస్తరిస్తున్నందున మండలంలో ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను ఉపయోగించడమే ఏకైక మార్గమని ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు అన్నారు.

కరోనాపై అవగాహన
తాళ్లూరులో ర్యాలీ నిర్వహిస్తున్న అధికారులు

పలుచోట్ల అవగాహన సదస్సులు

ఓవైపు వ్యాక్సినేషన్‌, మరోవైపు నిర్దారణ పరీక్షలు

ముండ్లమూరు, ఏప్రిల్‌ 16 : కరోనా వైరెస్‌ రోజురోజుకు విస్తరిస్తున్నందున మండలంలో ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను ఉపయోగించడమే ఏకైక మార్గమని ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్‌ఆర్‌ క్రాంతి పథకం కార్యాలయంలో గ్రామ వీవోఏలు, మహిళా సమాఖ్య అధ్యక్షురాళ్లతో సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం వలన కరోనా దరి చేరకుండా చేయవచ్చన్నారు. తహసీల్దార్‌ పీ పార్వతి మాట్లాడుతూ కరోనా వైరెస్‌ పూర్తిగా అరికట్టడానికి గ్రామాల్లో వీవోఏలు, డ్వాక్రా మహిళలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి మనోహర్‌రెడ్డి, ఏపీఎం టీ బాబూరావు, సీహెచ్‌వో నారాయణరావు, మహిళా సంఘం అధ్యక్షురాళ్ళు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

సీఎ్‌సపురం : ఎవరికి వారు స్వీయ రక్షణ పాటించడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చని ఎంపీడీవో ఎన్‌.బాలాజీ తెలిపారు. స్థానిక వె లుగు కార్యాలయంలో శుక్రవారం స్వయం రక్ష కరోనా వ్యాధి నివారణపై మండలంలోని వీవోఏలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఏపీఎం రజని, ఏవో కె.రాధా, పంచాయితీ కార్యదర్శులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

తాళ్లూరు : ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని వైకేపీ ఏపీఎం సీహెచ్‌ వెంకట్రావు తెలిపారు. కరోనావ్యాది నివారణపై అవగాహన సదస్సు స్థానిక వైకేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన వాళ్లందరూ తమ పేర్లు రిజిష్ట్రేషన్‌ చేయించుకుని వ్యాక్సిన్‌ వేయించుకోవాలన్నారు. శిక్షణ పొందిన వీవోఏలు, గ్రామైఖ్య సంఘం అధ్యక్షురాళ్లు పొదుపు గ్రూపు మహిళలు  గ్రామాల్లో 45 ఏళ్లు పైబడిన వ్యక్తులనుగుర్తించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీహెచ్‌ఎ్‌స కొప్పోలుశ్రీనివాసరావు మండల మహిళా సమాఖ్య అద్యక్షురాలు ఎల్‌.విజయలక్ష్మి, సభ్యులు సుభాషిణి, సత్యవతి, ఆదిలక్ష్మి, సీసీలు  ఆశాజ్యోతి, చంద్ర, కోటేశ్వరమ్మ,  , కుమారి,  వీవోలు, వీవోఏలు,  తదితరులు పాల్గొన్నారు.

వెలిగండ్ల : కొవిడ్‌ రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డాక్టర్‌ విజయ్‌కుమార్‌ అన్నారు. ఇటీవల కాలంలో మొగళ్లూరులో పాజిటీవ్‌ కేసులు నమోదైన వారి గృహాన్ని శుక్రవారం సందర్శించి వారితో మాట్లాడారు. హోమ్‌ క్వారం టైన్‌లో ఉన్నప్పుడు బయటెక్కడా సంచరించకుండా సకాలంలో డాక్టర్ల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. అదేవిధంగా మరపగుంట్లకు విజయవాడ నుంచి వచ్చిన విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. ఈ విద్యార్థిని కూడా హోమ్‌ క్వారంటైన్‌ ఉంచినట్లు తెలిపారు. అలాగే వెలిగండ్ల మండలంలోని రాజకీయ నాయకులకు కూడా కరోనా సోకిందనే అనుమానంతో వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. 

పామూరు : మండలంలోని పామూరు, బొట్లగూడూరు ప్రభుత్వ వైద్యశాలలో శుక్రవారం 100 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్‌ పి.రాజశేఖర్‌, డాక్టర్‌ కె.కామాక్షయ్యలు తెలిపారు. మండలంలో ఇప్పటి వరకు 20 కరోనా యాక్టివ్‌ కేసులను గుర్తించినట్లు వారు తెలిపారు. దుగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పు లు ఇలాంటి లక్షణాలు ఉన్నవారు.  వెంటనే ప్రభుత్వ వైద్యశాలల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూ చించారు. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తగా మాస్కు లు, భౌతిక దూరం లాంటి జాగ్రత్తలు పాటించాల న్నారు. 

దొనకొండ : మండలంలోని పలు గ్రామాల్లో కరోనా వైరస్‌ సెకెండ్‌ వేవ్‌ ఉదృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఐదుగురికి ప్రస్తుతం మరో ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ వైద్యశాలల్లో చేరిన వారి రిపోర్టులు మాత్రమే అధికారికంగా అందుతుండగా కరోనా భారిన పడిన మరికొందరు పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేట్‌ వైద్యశాలల్లో వైద్యం పొందుతున్నట్లు సమాచారం. ప్రజలు మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వలనే వైరస్‌ ఉదృతమవుతున్నట్లు స్పష్టమవుతుంది. ప్రజలు బయటకు వచ్చే సమయాల్లో తప్పనిసరిగా మాస్కులు దరించాలని ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది 45 సంవత్సరాలు నిండిన వారిని చైతన్యపర్చుతూ కరోనా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు.

మొగిలిచెర్ల పాఠశాల ఆయాకు కరోనా

మొగిలిచెర్ల(లింగసముద్రం) : మండలంలోని మొగిలిచెర్ల ప్రాథమిక పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్న ఓ మహిళకు కరోనా సోకింది. ఈ నెల 12న వైద్యాధికారులు, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, కుకింగ్‌ ఏజన్సీ మహిళలకు, ఆయాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే వీరి ఫలితాలు గురువారం ఉదయం  వచ్చాయి. వీరిలో ఆయాకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దీంతో విషయం తెలియడంతో ఉపాధ్యాయులు విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అయితే ఈ విషయం విద్యార్ధుల తలిదండ్రులకు తెలియడంతో శుక్రవారం తమ పిల్లలను పాఠశాలకు పంపించలేదు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయులు ఎల్‌.సుధాకర్‌ మాట్లాడుతూ సుమారు 132 మంది విద్యార్ధులకు కేవలం నలుగురు మాత్రమే వచ్చారని చెప్పారు. ఒకటి రెండు రోజులలో పాఠశాలలో కరోనా పరీక్షలు చేస్తారని చెప్పారు.

కరోనాతో వ్యక్తి మృతి

కందుకూరు, ఏప్రిల్‌ 16: కరోనా సెంకెండ్‌ వేవ్‌ నేపథ్యంలో పట్టణంలో శుక్రవారం తొలి మరణం నమోదైంది. స్థానిక రెవెన్యూ కాలనీలో నివసించే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కరోనా బారినపడి మృతిచెందాడు. ఇంటివద్ద నుండి పనిచేస్తున్న 37 సంవత్సరాల యువకుడు కరోనాతో నాలుగు రోజులుగా స్థానికంగా చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం పరిస్థితి విషమించడంతో ఒంగోలు తరలించే ప్రయత్నం చేస్తుండగా, మార్గమధ్యంలోనే మృతిచెందాడు. కరోనా నిర్థారణ  పరీక్షలు పూర్తి స్థాయిలో చేయకపోవడంతో ఎక్కువ మంది ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. కరోనా చికిత్సలో వాడే మందులు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి విషమిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-04-17T05:49:20+05:30 IST