అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన

ABN , First Publish Date - 2021-04-16T05:28:05+05:30 IST

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజీలో గురువారం ఆర్టీసీ కార్మికులకు అగ్నిప్రమాద నియంత్రణ చర్యలపై ఫైర్‌ ఆఫీసర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహన కల్పించారు.

అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన
కార్మికులకు అవగాహన కల్పిస్తున్న ఫైర్‌ సిబ్బంది


కనిగిరి, ఏప్రిల్‌ 15: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజీలో గురువారం ఆర్టీసీ కార్మికులకు అగ్నిప్రమాద నియంత్రణ చర్యలపై ఫైర్‌ ఆఫీసర్‌ రామకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫైర్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఆందోళన చెందకుండా ముందుగా ఆయా పరిసరాల్లో నియంత్రణ ఏర్పాట్లకు అనుకూలంగా ఉన్నాయో.. లేదో.. గమనించాలన్నారు. ఒక వేళ బస్సుల్లో ప్రయాణించేటపుడు ఒక్కసారిగా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినపుడు నియంత్రణ చర్యలపై డెమో చేసి చూపించారు.

టంగుటూరు : అగ్నిప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని స్థానిక అగ్నిమాపక అధికారి వెంకయ్య సూచించారు. స్థానిక అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభమైన అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ముందుగా బుధ, గురువారాల్లో అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, గ్రామంలోని పలు ప్రధాన కూడళ్లలో కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు, శుక్రవారం నుంచి మాక్‌ డ్రిల్‌ ద్వారా ప్రజలను చైతన్యం చే యనున్నట్లు సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2021-04-16T05:28:05+05:30 IST