ఆవ్రా లేబొరేటరీస్ ట్రాన్స్‪లేషనల్ రీసెర్చ్‌ కోసం ప్రత్యేక కమిటీ

ABN , First Publish Date - 2020-10-02T07:09:09+05:30 IST

ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అవ్రా లాబొరేటరీస్ ట్రాన్స్‪లేషనల్ రిసెర్చ్ కోసం 3 ప్రత్యేక చైర్స్ కమిటీ ఏర్పాటు చేయనుంది. రీసెర్చ్ రంగంలో అత్యుత్తమ కృషిని గుర్తించి, అందుకు..

ఆవ్రా లేబొరేటరీస్ ట్రాన్స్‪లేషనల్ రీసెర్చ్‌ కోసం ప్రత్యేక కమిటీ

హైదరాబాద్: ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అవ్రా లాబొరేటరీస్ ట్రాన్స్‪లేషనల్ రిసెర్చ్ కోసం 3 ప్రత్యేక చైర్స్ కమిటీ ఏర్పాటు చేయనుంది. రీసెర్చ్ రంగంలో అత్యుత్తమ కృషిని గుర్తించి, అందుకు మద్దతిచ్చే ఉద్దేశంతో కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్)లో 3 రిసెర్చ్ ఛైర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ చైర్స్ కమిటీని అవ్ర లాబొరేటరీస్ అధినేత డాక్టర్ ఏవీ రామారావు, సీఎస్ఐఆర్-ఐఐసీటీ మాజీ డైరెక్టర్ గౌరవార్థం ఏర్పాటు చేయనున్నారు. ఎంపిక చేసిన సైంటిస్ట్ ల కృషిని గుర్తించడానికి ఈ రీసెర్చ్ కమిటీ ద్వారా మూడేళ్ళ పాటు ఫెలోషిప్ ఇస్తారు. ఛైర్ సెలక్షన్ కమిటీ 2020-2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ ప్రతిష్టాత్మక ఫెలోషిప్ స్వీకరించడానికి హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, పుణెలోని సీఎస్ఐఆర్ - నేషనల్ కెమికల్ లేబొరేటరీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ అమోల్ ఏ కులకర్ని ఎంపికయ్యారు. వీరిలో డాక్టర్ చంద్రశేఖర్ ఫార్మా రంగంలో ట్రాన్స్‪లేషనల్ రిసర్చ్ లో అత్యుత్తమంగా కృషి చేశారు. అలాగే ఆమోల్ కులకర్ణి ట్రాన్స్‪లేషనల్ రిసెర్చ్, మైక్రో ఫ్లో రియాక్టర్లతో సహా కంటిన్యువస్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ల వ్యాపారీకరణలో కృషి చేశారు.


 గత 25 ఏళ్ళుగా, అధునాతన ఫార్మాసూటికల్ ఇంటర్మీడియట్లని అభివృద్ధి చేయడానికి, ప్రయోగశాల నుంచి వ్యాపారస్థాయిలో సరఫరా చేయడానికి, దేశీయ, బహుశజాతి కంపెనీలతో ఆవ్రా సన్నిహితంగా పనిచేస్తోంది. ఈ కంపెనీ పలు సంక్లిష్ట మాలికుల్స్ తయారీకోసం సరికొత్త తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే క్రమాన్ని అభివృద్ధి చేసింది.

Updated Date - 2020-10-02T07:09:09+05:30 IST