మతోన్మాదానికి దూరంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-07-03T05:26:29+05:30 IST

మతోన్మాదానికి దూరంగా ఉండాలి

మతోన్మాదానికి దూరంగా ఉండాలి
సర్వోదయ శిక్షణ తరగతులకు హాజరైన కాంగ్రెస్‌ ప్రతినిధులు


  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌
  • కీసర మండలంలో సర్వోదయ శిక్షణా తరగతుల ప్రారంభం

మేడ్చల్‌, జులై 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న మతోన్మాదానికి దూరంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ అన్నారు. శనివారం మేడ్చల్‌-మల్కాజిగిరిజిల్లా కీసర మండలంలోని బాలవికాస కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో పార్టీ ప్రతినిధులకు రెండు రోజులపాటు నిర్వహించే సర్వోదయ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మహే్‌షకుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ మతోన్మాదాన్ని ప్రతిఒక్కరూ వ్యతిరేకించాలని పేర్కొన్నారు. ప్రజల్లో పెరిగిపోతున్న మతపరమైన విభజనను నివారించడం, పార్టీ సంస్థాగత శిక్షణ, కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను అమలు చేసే విధంగా కార్యకర్తలను ముందుండి నడిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా హాజరైన ప్రతినిధులకు సర్టిఫికెట్ల ప్రదానంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ భవిష్యత్తుపై మాట్లాడటానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆదివారం జరిగే సర్వోదయ శిక్షణా ముగింపు తరగతులకు పీసీసీచీఫ్‌ హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2022-07-03T05:26:29+05:30 IST