Abn logo
Oct 22 2021 @ 00:34AM

అవినీతిపై అధికారుల ఆరా

పరిగి, అక్టోబరు 21: మండలంలోని శాసనకోటలో మహిళా సంఘాల నిధులకు సంబంధించిన రికార్డులను ఐకేపీ సీసీ, ఏపీఎంలు గురువారం పరిశీలించారు. మహిళాసంఘాల నిధులు స్వాహా చేసినట్లు సంఘం సభ్యులు ఐకేపీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 50 సంఘాల పొదుపు నిధులను బుక్‌కీపర్‌, బ్యాంక్‌మిత్రగా పనిచేస్తున్న నాగరత్నమ్మ తన భర్త భాస్కర్‌రెడ్డి ఖాతాకు జమచేసుకున్నట్లు సంఘ సభ్యులు ఫిర్యాదు చేశారు. తాము ప్రశ్నిస్తుంటే ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోందని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. ఐకేపీ ఏపీఎంను సమాచారం కోరగా ఏదో కొంతమొత్తం అవినీతి జరిగిందని, ఆ సొమ్మును రికవరీ చేసి సంఘాలకు ఇప్పిస్తామన్నారు.