Oct 14 2021 @ 08:21AM

Avika-Gor: నిర్మాతగా ఇది అద్భుతమైన అనుభవం..

నిర్మాతగా ఇది అద్భుతమైన అనుభవం..అంటోంది యంగ్ బ్యూటీ అవికా గోర్. 'చిన్నారి పెళ్ళి కూతురు' సీరియల్‌తో స్మాల్ స్క్రీన్ మీద బాగా పాపులర్ అయిన ఆమె 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అవికా..ఆ తర్వాత 'సినిమా చూపిస్తా మావ', 'లక్ష్మీ రావే మా ఇంటికి', 'రాజుగారి గది 3' వంటి చిత్రాలలో నటించి బాగానే పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ నిర్మాతగా మారి ఓ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి అవికా.. 'ఇది నా మొదటి ప్రొడక్షన్ కనుక అద్భుతమైన అనుభవం. మేం గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాం. మొత్తం లొకేషన్‌లో వైబ్ చాలా విభిన్నంగా ఉంది'..అని తెలిపింది. కాగా ఆమే ప్రస్తుతం నాగ చైతన్య, రాశిఖన్నా జంటగా నటిస్తున్న 'థాంక్యూ' సినిమాతో పాటు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఓ మూవీలోనూ నటిస్తోంది.