కచకచా నమిలేస్తూ.. రాక్షస సాలీడును చూసి నెటిజన్లు షాక్!

ABN , First Publish Date - 2020-09-20T18:51:43+05:30 IST

ప్రకృతి అంటే..చెట్లు, కొండలు, గుట్టలు, ఆకాశం, నీలి మేఘాలు, హరివిల్లు.. అంతా మనసుకు ఉల్లాసాన్నిచ్చే రమణీయత! ఇది నాణానికి ఓవైపు! మరోవైపు.. పకృతి అంటే జీవన్మరణ పోరాటానికి వేదిక, భీతి గొలిపే దృశ్యాల సమాహారం. ప్రస్తుతం ఇటువంటి ఓ వీడియో చూసే నెటిజన్లు జడుసుకుంటున్నారు.

కచకచా నమిలేస్తూ.. రాక్షస సాలీడును చూసి నెటిజన్లు షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి అంటే..చెట్లు, కొండలు, గుట్టలు, ఆకాశం, నీలి మేఘాలు, హరివిల్లు.. అంతా మనసుకు ఉల్లాసాన్నిచ్చే రమణీయత! ఇది నాణానికి ఓవైపు! మరోవైపు.. పకృతి అంటే జీవన్మరణ పోరాటానికి వేదిక, భీతి గొలిపే దృశ్యాల సమాహారం. ప్రస్తుతం ఇటువంటి ఓ వీడియో చూసే నెటిజన్లు జడుసుకుంటున్నారు. ఈ విడియో చూసిన వారంతా ఒళ్లు గగుర్పొడిచేలా ఉందంటూ గగ్గోలు పెడుతున్నారు. అవిక్యూలేరియా అనే భయం గొలిపే సాలీడుకు చెందిన వీడియో ఇది. 


ఇంట్లో వాలిన ఓ చిన్న పిట్టను చంపి..కచకచా నములుతూ సాలీడు భోంచేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతటి భీతి గొలిపే దృశ్యాలను తామెన్నడూ చూడలేదని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. ‘ఇది ఎవరింట్లో అయితే మకాం పెట్టిందో వారు క్షేమంగా ఉండాలని భగవంతుడి ప్రార్థిస్తున్నాం’ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా.. అవిక్యూలేరియా సాలీళ్లు చిన్న చిన్న పక్షులను వేటాడంలో సిద్ధ హస్థులని నిపుణులు చెబుతున్నారు. ఇవి దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తాయట!



Updated Date - 2020-09-20T18:51:43+05:30 IST