Electricity bill: కరెంటు బిల్లంటూ మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.. అయితే ఆ పని అస్సలు చేయవద్దంటున్న అధికారులు!

ABN , First Publish Date - 2022-08-31T16:00:13+05:30 IST

‘మీ కరెంటు బిలును వెంటనే కట్టేయండి. లేదంటే పవర్ కనెక్షన్‌ను కట్ చేస్తాం’ అనే సారాశంతో కూడిన మెసేజ్‌లు గత కొద్ది రోజులుగా కొంత మంది ఫోన్‌లకు వస్తున్నాయి. అందులో ఓ ఫోన్ నెంబర్ కూడా ఉంటోంది. ఈ క్రమంలోనే చాలా మంది సదరు నెం

Electricity bill: కరెంటు బిల్లంటూ మీ ఫోన్‌కు ఈ మెసేజ్ వచ్చిందా.. అయితే ఆ పని అస్సలు చేయవద్దంటున్న అధికారులు!

ఇంటర్నెట్ డెస్క్: ‘మీ కరెంటు బిలును వెంటనే కట్టేయండి. లేదంటే పవర్ కనెక్షన్‌ను కట్ చేస్తాం’ అనే సారాశంతో కూడిన మెసేజ్‌లు గత కొద్ది రోజులుగా కొంత మంది ఫోన్‌లకు వస్తున్నాయి. అందులో ఓ ఫోన్ నెంబర్ కూడా ఉంటోంది. ఈ క్రమంలోనే చాలా మంది సదరు నెంబర్‌కు ఫోన్ చేస్తున్నారు. తర్వాత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు స్పందిస్తు కీలక ప్రకటన చేశారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కరెంట్ బిల్లు(electricity bill) కట్టండి. లేదంటే పవర్ కట్ చేస్తాం అని పేర్కొంటూ మొబైల్‌ నెంబర్‌తో కూడిన మెసేజ్‌లు ఎవరికైనా వస్తే అస్సలు భయపడవద్దని ఎలక్ట్రిసిటీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కంగారుపడి మెసేజ్‌లో ఉన్న మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేస్తే.. బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేస్తూ.. ఇలాంటి మెసేజ్‌లను పంపిస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ మెసేజ్‌లో పేర్కొన్న మొబైల్ నెంబర్‌కు పొరపాటు ఎవరైనా ఫోన్ చేస్తే.. అవతలి వాళ్లు మరింత భయాందోళనలకు గురి చేసి బ్యాంకు ఖాతాతో పాటు ఇతర వివరాలు కూడా తెలుసుకుని సొత్తు కాజేస్తారని తెలిపారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అటువంటి మెసేజ్‌లకు స్పందించొద్దని ప్రజలకు సూచించారు. గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, ఒడిస్సా రాష్ట్రాలకు చెందిన ప్రజలకు ఇటువంటి మెసేజ్‌లు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలకు అక్కడి అధికారులు ఈ సూచనలు చేశారు. 


Updated Date - 2022-08-31T16:00:13+05:30 IST