‘క్లబ్‌హౌస్‌ స్థలాన్ని కాపాడండి’

ABN , First Publish Date - 2022-07-01T05:30:00+05:30 IST

‘క్లబ్‌హౌస్‌ స్థలాన్ని కాపాడండి’

‘క్లబ్‌హౌస్‌ స్థలాన్ని కాపాడండి’

మొయినాబాద్‌, జూలై 1: చిలుకూరు రెవెన్యూ పరిధిలో ఓ రియల్‌ఎస్టేట్‌ సంస్థ విక్రయించిన క్లబ్‌హౌస్‌ స్థలాన్ని కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ప్లాట్ల కొనుగోలుదారులు ఆరోపించారు. 20ఏళ్ల కింద 100 ఎకరాల్లో ఈ వెంచర్‌ ఏర్పాటు చేసి క్లబ్‌హౌస్‌, స్విమ్మింగ్‌పూల్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తమకు ప్లాట్లను విక్రయించినట్లు తెలిపారు. అయితే కొంతమంది రియల్‌ఎస్టేట్‌ సంస్థతో కుమ్మక్కై అప్పట్లో చేపట్టిన నిర్మాణాలు కూల్చేందుకు గురువారం రాత్రి యంత్రాలతో వెళ్లగా ప్లాట్ల కొనుగోలుదారులు అడ్డుకున్నారు. అనంతరం మొయినాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యంత్రాన్ని పీఎస్‌కు తరలించారు.

Updated Date - 2022-07-01T05:30:00+05:30 IST