Abn logo
May 23 2020 @ 14:46PM

ప్రారంభం కానున్న ‘అవ‌తార్ 2’

క‌రోనా వ‌ల్ల చాలా రంగాలు స్తంభించాయి. వీటిలో సినీ పరిశ్ర‌మ ఒక‌టి. హాలీవుడ్, ఇండియ‌న్ సినిమా స‌హా అన్నీ ప‌రిశ్ర‌మ‌లు షూటింగ్‌లు ఆపేశాయి. ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ షూటింగ్స్ చేయడంపై ఫోకస్ పెట్టారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌ల మేర‌కు చిత్రీక‌ర‌ణ‌ను జ‌ర‌ప‌డానికి మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో అవ‌తార్ 2 మేక‌ర్స్ జూన్ నుండి ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోత‌న్నారు. ఈ విష‌యాన్ని నిర్మాత‌ల్లో ఒక‌రైన జోన్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశారు. అవ‌తార్ 2 త‌దుప‌రి షెడ్యూల్ న్యూజిలాండ్‌లో ప్రారంభం కానుంది. 

Advertisement
Advertisement
Advertisement