విశాఖ: సీఎం, మంత్రులపై పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు రాష్ట్రం గురించి మాట్లాడతారని అని ప్రశ్నించారు. ఆయన సినిమాలన్నీ ఫారెన్‌లోనే తీస్తారు ఏపీలో ఎందుకు తీయరు అని ప్రశ్నించారు. పెద్దలు చిరంజీవి, మోహన్‌బాబుపై కూడా ఆయన మాట్లాడిన తీరు సరైంది కాదన్నారు. మంత్రులను సన్నాసులు అంటున్నారని, ఆయనతోమ సినిమా పెద్దలు అందరూ సన్నాసులని ఆయన అర్థమా? అని మంత్రి ప్రశ్నించారు. ఆన్ లైన్ విధానంపై ఆయన తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత దూషణలు బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం, ఉండాలి.. బ్యాలెన్స్ తప్పుతున్నారు.. ధ్యాన కేంద్రంకి వెళితే మంచిదని పవన్‌కు మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు.