అందుబాటులోకి మోడల్‌ రైతుబజార్‌

ABN , First Publish Date - 2021-10-12T05:47:30+05:30 IST

తాత్కాలిక కూరగాయల మార్కెట్లలో ప్రజలు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్‌ రైతుబజార్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

అందుబాటులోకి మోడల్‌ రైతుబజార్‌
రైతుబజారు పనులను పరిశీలిస్తున్న భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, కార్యదర్శి

దీపావళి తర్వాత ప్రారంభించేందుకు సన్నాహాలు

రూ.41లక్షలతో మౌలికవసతులు కల్పన 

రూ.2.51కోట్లతో ఆధునిక హంగులతో మోడల్‌ రైతుబజారు

తుదిదశకు పనులు



(ఆంధ్రజ్యోతి, యాదాద్రి):  తాత్కాలిక కూరగాయల మార్కెట్లలో ప్రజలు, వ్యాపారులు పడుతున్న ఇబ్బందులు త్వరలో తీరనున్నాయి. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మోడల్‌ రైతుబజార్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. నెల రోజుల్లో అందుబాటులోకి తెచ్చేందుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం మౌలిక వసతుల పనులు కొనసాగుతున్నాయి. అవి పూర్తయితే దీపావళి అనంతరం మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు వ్యవసాయ, ఆర్థిక మంత్రులతో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 


భువనగిరి పట్టణంలో రైతుబజారు లేకపోవడంతో రైతులు, వినియోగ దారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా రు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. రైతులకు, వినియోగదారులకు సరైన వసతులూ లేవు. నాలుగే ళ్ల కిందటే మార్కెటింగ్‌ శాఖ ఈ రైతు మార్కెట్‌ను రూ.2.10కోట్లతో 74 స్టాళ్లను నిర్మించింది. అయితే మౌళి  క వసతులైన ఫ్లాట్‌ఫాం, మం చినీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో రైతుబజారు వృథాగా ఉంది. ప్రజలు పడుతు న్న ఇబ్బందుల దృష్ట్యా మౌళిక వసతులు ఏర్పా టు కోసం మార్కెటింగ్‌ శాఖ రూ.41లక్షలతో ప్రతిపాదనలు పంపింది. ఈ నిధులు మంజూరు కావడంతో మోడల్‌ రైతుబజారులో అసంపూర్తి పనులను చేపట్టారు. రూ.7లక్షల తో ఆర్వో ప్లాంట్‌, రూ.7లక్షలతో పరిశుభ్రత గదులు, మరుగుదొడ్లు, రూ.21లక్షలతో రైతుబజార్‌ ప్రాంగణంలో సీసీరోడ్డు, రూ.3.50లక్షలతో హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటుచేశారు. ఈ పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీసీ రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. వారం, పది రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రైతుబజారు అందుబాటులోకి రాగానే మంత్రి జగదీ్‌షరెడ్డితో పాటు వ్యవసాయ, ఆర్థిక మంత్రులతో దీపావళి తర్వాత ప్రారంభించేందుకు మార్కెటింగ్‌ శాఖ సన్నద్ధమవుతోంది. 


తాత్కాలిక మార్కెట్లలో ఇక్కట్లు

శాశ్వత రైతుబజారు లేకపోవడంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల, కళాశాల మైదానంలో మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన రైతులు ఈ ప్రాంతంలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటోంది. రైతుబజారుకు నిత్యం వందలాది వాహనాలు వస్తుండటతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణ చిత్తడిగా మారింది. ఇదిలా ఉండగా మోడల్‌ రైతుబజారు అందుబాటులోకి వినియోగదారుల ఇబ్బందులు తీరనున్నాయి. మోడల్‌ రైతుబజారులో ఏర్పాటుచేసిన 74 స్టాళ్లల్లో వివిధరకాల కూరగాయలను విక్రయించనున్నారు. దీనికి అనుసంధానంగా ఉన్న పాత రైతుబజారులో 42 స్టాళ్లను ఏర్పాటుచేశారు. ఆ స్టాళ్లల్లో కేవలం ఆకుకూరలు మాత్రమే విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


త్వరలో అందుబాటులోకి రైతుబజార్‌ :  రమే్‌షగౌడ్‌, భువనగిరి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌

మోడల్‌ రైతుబజార్‌ను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.41లక్షలతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. నెలరోజుల్లోగా రైతుబజారును ప్రారంభిస్తాం. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో చేపట్టేలా మార్కెటింగ్‌ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. 


Updated Date - 2021-10-12T05:47:30+05:30 IST