ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌ ప్రజాస్వామ్యానికే ప్రమాదం

ABN , First Publish Date - 2021-07-24T05:45:20+05:30 IST

పెగాసెస్‌ స్పైవేర్‌ను వినియోగించి దేశంలో ప్రముఖ నేతలతో పాటు పాత్రికేయులు ఇతర ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రముఖుల ఫోన్ల హ్యాకింగ్‌ ప్రజాస్వామ్యానికే ప్రమాదం
సమావేశంలో మాట్లాడుతున్న కొండా శివరామిరెడ్డి తదితరులు

గుంటూరు, జూలై 23: పెగాసెస్‌ స్పైవేర్‌ను వినియోగించి దేశంలో ప్రముఖ నేతలతో పాటు పాత్రికేయులు ఇతర ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వస్తున్న ఆరోపణలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో పెగాసెస్‌ కుంభకోణం - భారతప్రజా స్వామ్యానికే కళంకం అనే అంశంపై శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాటట్లాడుతూ ప్రముఖుల ఫోన్‌లను హ్యాకింగ్‌ చేయటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. సమావేశంలో న్యాయవాది హరి, యోగాచార్యులు అచ్యుత ఇందుశేఖర్‌, పీఎస్‌ మూర్తి, మురళీకృష్ణ, జనార్ధనరావు తదితరులున్నారు.   

 

Updated Date - 2021-07-24T05:45:20+05:30 IST