అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

ABN , First Publish Date - 2022-01-28T02:43:54+05:30 IST

విధి నిర్వహణలో విశిష్ట సేవలందించి గణతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉదయగిరి సీ

అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
సీఐను సన్మానిస్తున్న నాయకులు

ఉదయగిరి రూరల్‌, జనవరి 27: విధి నిర్వహణలో విశిష్ట సేవలందించి గణతంత్ర దినోత్సవం రోజున కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉదయగిరి సీఐ గిరిబాబును, స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో గురువారం పలువురు నాయకులు, పట్టణ ప్రముఖులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. సన్మానించిన వారిలో జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ గాజుల తాజుద్దీన్‌, సర్పంచి సయ్యద్‌ గౌస్‌మొహీద్దీన్‌, నాయకులు దస్తగిరిఅహ్మద్‌, ఫారుఖ్‌అలీ, మట్ల రామయ్య, లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-01-28T02:43:54+05:30 IST