ఆటోమొబైల్ విక్రయాలు తగ్గాయ్... * సెమీకండక్టర్ల కొరత, ఇతరత్రా పరిణామాలు కారణం... ఫిబ్రవరిలో 23 %...

ABN , First Publish Date - 2022-03-11T21:12:58+05:30 IST

దేశీయ ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్ర వాహనాల టోకు విక్రయాలు కిందటి(ఫిబ్రవరి) నెలలో 13,28,027 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి.

ఆటోమొబైల్ విక్రయాలు తగ్గాయ్...   * సెమీకండక్టర్ల కొరత, ఇతరత్రా పరిణామాలు కారణం...   ఫిబ్రవరిలో 23 %...

న్యూఢిల్లీ : దేశీయ ప్రయాణీకుల వాహనాలు, ద్విచక్ర వాహనాల టోకు విక్రయాలు కిందటి(ఫిబ్రవరి) నెలలో 13,28,027 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఫిబ్రవరి 2021 లో 17,35,909 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 23 శాతం క్షీణత చోటుచేసుకుంది. ప్యాసింజర్ కార్ల హోల్‌సేల్స్ గత నెలలో 1,33,572 యూనిట్లుగా ఉన్నాయి. కిందటి సంవత్సరం ఇదే నెలలో వీటి అమ్మకాలు... 1,55,128 యూనిట్లు. కాగా... యుటిలిటీ వెహికల్ డిస్పాచ్‌లు గతేడాది ఇదే కాలంలో 1,14,350 యూనిట్ల నుంచి 1,20,122 యూనిట్లకు పెరిగాయి. 

దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీల నుంచి డీలర్‌షిప్‌లకు ఆటోమొబైల్ పంపకాలు ఫిబ్రవరిలో 23 శాతం క్షీణించాయని, సెమీకండక్టర్ కొరత సహా ఇతరత్రా సవాళ్లు, కొత్త నిబంధనల అమలు తదితర పరిణామాల నేపథ్యంలో... వాహనాల ధరల పెరుగుదల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడినట్లు చెబుతున్నారు. మొత్తంమీద... ఈ ఏడాది ఫిబ్రవరిలో... ప్రయాణికుల వాహనాల పంపిణీ ఆరు శాతం క్షీణించి, 2,62,984 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో 2,81,380 యూనిట్ల విక్రయం జరిగింది. ఫిబ్రవరి 2021 లో 1,55,128 యూనిట్లతో పోలిస్తే ప్యాసింజర్ కార్ల హోల్‌సేల్స్ కిందటి నెలలో 1,33,572 యూనిట్లుగా ఉన్నాయి. కాగా... యుటిలిటీ వెహికల్ విక్రయాలు గతేడాది ఇదే కాలంలో 1,14,350 యూనిట్ల నుంచి 1,20,122 యూనిట్లకు పెరిగాయి.


 కాగా... వ్యాన్ల విక్రయాలు నిరుడు  ఫిబ్రవరిలో 11,902 యూనిట్లతో పోలిస్తే, కిందటి  నెలలో 9,290 యూనిట్లకు తగ్గాయి. అలాగే... మొత్తం ద్విచక్ర వాహనాల హోల్‌సేల్స్ ఫిబ్రవరిలో 10,37,994 యూనిట్లకు తగ్గాయి.  గతేడాది ఇదే నెలలో 14,26,865 యూనిట్ల విక్రయం జరిగింది. అంటే... 27 శాతం తగ్గుదల నమోదైంది. ఫిబ్రవరిలో స్కూటర్ హోల్‌సేల్స్ 3,44,137 యూనిట్లకు పడిపోయాయి. నిరుడు ఇదే నెలలో  4,65,097 యూనిట్ల విక్రయం జరిగింది. మోటార్‌సైకిళ్ళ విక్రయాలు కూడా నిరుడు ఫిబ్రవరిలో 9,10,323 యూనిట్ల నుంచి... కిందటి నెలలో 6,58,009 యూనిట్లకు తగ్గాయి.  కాగా... నిరుడు ఫిబ్రవరిలో 27,656 యూనిట్లతో పోలిస్తే... కిందటినెలలో త్రిచక్ర వాహనాల విక్రయాలు... స్వల్పంగా... అంటే...  27,039 యూనిట్లకు తగ్గాయి.


సెమీకండక్టర్ కొరత, కొత్త నిబంధనల కారణంగా ధరల పెరుగుదల, సామాగ్రికి సంబంధించి పెరిగిన ధరలు, అధిక లాజిస్టిక్స్ ధరలు తదితర పరిస్థితులు, ఇతరత్రా సవాళ్ళు ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇవి ఆటో పరిశ్రమలో మొత్తం అమ్మకాలపై ప్రభావం చూపాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(ఎస్‌‌ఐఏఎం) డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. మొత్తంమీద... ప్రపంచవ్యాప్తంగా  సరఫరా ప్రక్రియలు ఒత్తిడికి లోనవుతోన్న నేపథ్యంలో... త్రిచక్ర వాహనాలు,  ద్విచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిళ్ల మొత్తం ఉత్పత్తి 20 శాతం తగ్గి 17,95,514 యూనిట్లకు పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

Updated Date - 2022-03-11T21:12:58+05:30 IST