ఆటోమొబైల్‌ రుణాల్లో ‘ప్రైవేటు’దే హవా

ABN , First Publish Date - 2021-01-20T08:49:01+05:30 IST

ఆటోమొబైల్‌ వాహనాల కొనుగోలుకు ఇచ్చే రుణాల్లో ప్రైవేటు సంస్థల హవా కొనసాగుతోంది. గత ఏడాది జూన్‌ నాటికి దేశంలోని మొత్తం ఆటోమొబైల్‌ రుణాల్లో మూడింట రెండు వంతులు ప్రైవేటు, విదేశీ సంస్థల నుంచి అందాయి.

ఆటోమొబైల్‌ రుణాల్లో ‘ప్రైవేటు’దే హవా

ముంబై : ఆటోమొబైల్‌ వాహనాల కొనుగోలుకు ఇచ్చే రుణాల్లో ప్రైవేటు సంస్థల హవా కొనసాగుతోంది. గత ఏడాది జూన్‌ నాటికి దేశంలోని మొత్తం ఆటోమొబైల్‌ రుణాల్లో మూడింట రెండు వంతులు ప్రైవేటు, విదేశీ సంస్థల నుంచి అందాయి. ‘క్రిఫ్‌ హై మార్క్‌’ అనే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ కంపెనీ తన తాజా నివేదికలో ఈ విషయం తెలిపింది. గత ఏడాది జూన్‌ నాటికి మొత్తం ఆటోమొబైల్‌ రుణాల్లో 41.4 శాతం ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలు,   24.4 శాతం విదేశీ బ్యాంకులు సమకూర్చాయి. అప్పటికి ఈ రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎ్‌సబీ)ల వాటా 19.6 శాతం  మాత్రమే. సంఖ్యాపరంగా చూస్తే మాత్రం మొత్తం రుణాల్లో 35 శాతం పీఎ్‌సబీలు సమకూర్చాయని ‘క్రిఫ్‌ హై మార్క్‌’ నివేదిక పేర్కొంది. 


నివేదిక ఇతర ప్రధాన అంశాలు :

 జూన్‌, 2020 నాటికి ఆటోమొబైల్‌ పరిశ్రమ మొత్తం రుణాలు రూ.1.13 లక్షల కోట్లు.

 పరిశ్రమ మొత్తం టర్నోవర్‌లో రుణాల వాటా 12 శాతం.

 మొత్తం రుణాల్లో ఎంఎ్‌సఎంఈల వాటా 91 శాతం.

 మొత్తం రుణాల్లో 48 శాతం టర్మ్‌ లోన్లు, 33 శాతం వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, 18 శాతం ఇతర రుణాలు.

 టర్మ్‌ రుణాల్లో 14.7 శాతం, వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాల్లో 5.2 శాతం ఎన్‌పీఏలు.

 కోవిడ్‌కు ముందు నుంచే కష్టాల్లో ఆటోమొబైల్‌ పరిశ్రమ.

 9.59 శాతానికి తగ్గిన ఎన్‌పీఏలు.

Updated Date - 2021-01-20T08:49:01+05:30 IST