ఆటోమేటిక్‌ హ్యాండ్‌ వాష్‌ పనితీరు భేష్‌

ABN , First Publish Date - 2020-05-14T10:43:15+05:30 IST

ప్రస్తుత కరోనా నివారణలో ఆటోమేటిక్‌ హ్యాండ్‌ వాష్‌ పనితీరు బాగుందని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ తెలియజేశారు. ఈ పరికరాన్ని సుండుపల్లె

ఆటోమేటిక్‌ హ్యాండ్‌ వాష్‌ పనితీరు భేష్‌

సంబేపల్లె, మే 13: ప్రస్తుత కరోనా నివారణలో ఆటోమేటిక్‌ హ్యాండ్‌ వాష్‌ పనితీరు బాగుందని పులివెందుల డీఎస్పీ వాసుదేవన్‌ తెలియజేశారు. ఈ పరికరాన్ని సుండుపల్లె మండలానికి చెందిన ఎలక్ర్టీషియన్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ ప్రసా ద్‌ రూపొందించినట్లు తెలిపారు. 


మనిషి బాక్సు పై నిలబడగానే నీళ్లు రావడం అనంతరం వాటంతట అవే ఆగిపోయే విధంగా సిస్టం ఏర్పాటు చేయడం బాగుందన్నారు. పోలీస్‌ స్టేషన్‌, తహసీల్దార్‌ కార్యాలయం, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డీఎస్పీ ప్రసాద్‌రావు, సంబేపల్లె ఎస్‌ఐ రాజారమేష్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-14T10:43:15+05:30 IST