ప్రతీకాత్మక చిత్రం
రాత్రి వేళ ప్రయాణమంటేనే కొందరు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఎంత రాత్రయినా వెళ్లక తప్పని పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడూ అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటి సమయాల్లో మహిళల విషయంలో చాలా దారుణాలు జరగడం ఇటీవల చాలా చూశాం. పట్టపగలే మహిళలకు భద్రత లేని నేటి సమాజంలో రాత్రి వేళ ఒంటరిగా కనబడితే.. మానప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఢిల్లీకి చెందిన ఓ మహిళ స్థానికంగా ఉన్న ఒక కంపెనీలో పని చేస్తోంది. రోజూ మాదిరే బుధవారం కూడా ఆఫీసుకు వెళ్లింది. అయితే పని ముగిసే సరికి రాత్రి కావడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఓ ఆటో ఎక్కింది. మహిళ ఒంటరిగా ఆటో ఎక్కడంతో డ్రైవర్.. ఆమెపై కన్నేశాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఉన్నట్టుండి ఆటోను నిలిపేశాడు. దీంతో ‘‘ఏంటి! మధ్యలో ఆటోను ఆపావ్’’.. అంటూ మహిళ ప్రశ్నించింది. ‘‘మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. మీరు కూర్చునే ఉండండి.. నేను వెళ్లి పెట్రోల్ తీసుకొస్తా’’.. అంటూ అక్కడి నుంచి వెళ్లాడు.
అతడి మాటలు నమ్మిన మహిళ ఆటోలోనే ఉండిపోయింది. బయటికి వెళ్లిన డ్రైవర్.. కాసేపటికి తన స్నేహితుడితో కలిసి అక్కడికి వచ్చాడు. అప్పటికే భయంతో ఉన్న మహిళ.. ఇద్దరినీ చూసి మరింత భయపడింది. అంతలోనే ఇద్దరూ ఆమెను బెదిరించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం నోరు మూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న ఆమె.. మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఇవి కూడా చదవండి