ఆటో పాస్‌వర్డ్‌ వద్దు

ABN , First Publish Date - 2022-01-08T05:30:00+05:30 IST

కొవిడ్‌ సంక్షోభం ఒకరకంగా సైబర్‌ క్రిమినల్స్‌కు నేరాలకు పాల్పడేందుకు వరంగా మారింది. ఇటీవల పెరిగిన సైబర్‌ నేరాలే అందుకు సాక్ష్యం. ..

ఆటో పాస్‌వర్డ్‌ వద్దు

కొవిడ్‌ సంక్షోభం ఒకరకంగా సైబర్‌ క్రిమినల్స్‌కు నేరాలకు పాల్పడేందుకు వరంగా మారింది. ఇటీవల పెరిగిన సైబర్‌ నేరాలే అందుకు సాక్ష్యం.    వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంతో మొదలుపెట్టి. పాస్‌వర్డ్‌ల సహాయంతో ఆర్థిక నేరాలకు ఈ క్రిమినల్స్‌ పాల్పడుతున్నారు. ఆటోకంప్లీట్‌ లాగిన్‌ దీనికి మూలమని  చెప్పవచ్చు. వేర్వేరు అకౌంట్లు, పాస్‌వర్డ్స్‌తో ఇబ్బంది పడలేక అత్యధికులు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్లపై ఆటో సేవ్‌ చేసుకుంటున్నారు.  అయితే వాస్తవం మరోలా ఉంది. గడచిన ఒక్క ఏడాది లోనే  నాలుగు లక్షల నలభై ఒక్క వేల మంది అకౌంట్లు హ్యాక్‌ అయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. haveibeenpwneed.com వెబ్‌సైట్‌ ఇలా తస్కరణకు గురైన వాటిని ట్రాక్‌ చేస్తోంది. ఈమెయిల్‌ అడ్రస్‌తో చెక్‌ చేసి, సంబంధితులను అలర్ట్‌ చేస్తోంది. 


మన డేటాను తస్కరించారా లేదా అన్న విషయం తెలుసుకోవాలంటే, ఈ వెబ్‌సైట్‌ సహాయం తీసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో రెడ్‌లైన్‌తో మీ   ఈమెయిల్‌ అకౌంట్‌ కనిపిస్తే వీపీఎన్‌ సహా వెంటనే పాస్‌వర్డ్‌ను మార్చుకోవాలి. సమాచారాన్ని తస్కరించే మాల్వేర్‌  పేరు రెడ్‌లైన్‌. 2020 మార్చిలో దీన్ని కనుగొన్నారు. ప్రైవేటు నెట్‌వర్క్‌ల నుంచి కూడా ఇది సమాచారాన్ని గోల్‌మాల్‌ చేయగలుగుతోంది. ఈ నేపథ్యంలో వెబ్‌ బ్రౌజర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో సైతం జోకర్‌ మాల్వేర్‌ ప్రవేశించి కొన్ని యాప్‌లను దెబ్బతీసింది. దాంతో ప్లేస్టోర్‌ కొన్ని యాప్‌లను తొలగించింది కూడా.

Updated Date - 2022-01-08T05:30:00+05:30 IST