Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Sun, 20 Mar 2022 19:21:21 IST

రన్నింగ్ ఆటో మీదికి వాటర్ బెలూన్ విసిరిన యువకుడు... దీంతో అంతా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో..

twitter-iconwatsapp-iconfb-icon
రన్నింగ్ ఆటో మీదికి వాటర్ బెలూన్ విసిరిన యువకుడు... దీంతో అంతా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో..

ఆకతాయిల చేష్టలు ఒక్కోసారి శృతి మించుతుంటాయి. హద్దులు దాటి మరీ వారు ప్రవర్తించే తీరు.. చూసేవారికి కోపం తెప్పిస్తూ ఉంటుంది. దురలవాట్లకు బానిసలైన వారు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు వారి చేష్టలకు అవతలి వారి జీవితాలు సర్వనాశనం అవుతుంటాయి. ఇలాంటి వారి కారణంగా ఎంతో మంది బాలికలు, యువతులు, మహిళలు నిత్యం ఎంతటి నరకం అనుభవిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. కొందరు యువకులు వేడుకల పేరుతో విధ్వంసం సృష్టిస్తూ ఉంటారు. తాజాగా యూపీలో ఇలాగే జరిగింది. హోలీ వేడుకల పేరుతో ఓ యువకుడు చేసిన నిర్వాకం చివరకు చాలా దూరం వెళ్లింది. రన్నింగ్ ఆటో మీదకు వాటర్ బెలూన్ విసరడంతో.. మరుక్షణంలో దారుణం జరిగిపోయింది.

హోలీ సందర్భంగా గత శుక్రవారం దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వేడుకలు కొన్నిచోట్ల ఆనందాలను పంచితే.. ఇంకొన్ని చోట్ల విషాదాన్ని నింపాయి. వేడుకల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఫుల్‌గా మందు తాగి.. తనను తాను కత్తితో పొడుచుకుని చనిపోయిన విషయం విదితమే. ఇదిలావుండగా యూపీలో ఓ యువకుడి నిర్వాకంతో ఆటోలో వెళ్తున్న ప్రయాణీకుల ప్రాణాల మీదకు వచ్చింది. హోలీ సందర్భంగా వీధుల్లో అంతా కలిసి రంగులు చల్లుకుంటున్నారు. ఓ యువకుడు వారితో పాటూ బెలూన్లలో రంగు నీళ్లు నింపుకొని, రోడ్డుపై వెళ్తున్న వారిపై విసురుతున్నాడు. అదే సమయంలో ఓ ఆటో ప్రయాణికులతో వెళ్తోంది. వారిని గమనించిన యువకుడు... రంగు నీళ్ల బెలూన్‌ను వారిపైకి వేగంగా విసిరాడు.

బాత్‌రూంకు వెళ్లేందుకు వేచి ఉన్న మహిళ.. మరో బాత్‌రూంకు వెళ్లండంటూ తాళాలు ఇచ్చిన రైల్వేస్టేషన్‌ స్వీపర్.. చివరకు

డ్రైవర్‌కు బెలూన్ గట్టిగా తాకడంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పింది. అంతా చూస్తుండగానే.. వేగంగా వెళ్లి రోడ్డుపై పడిపోయింది. గమనించిన చుట్టు పక్కల వాళ్లు.. ఆటోను పైకి లేపి ప్రయాణికులను బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జరగ్గానే ఆకతాయి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ ఆకతాయిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’’పై క్లాసులో చెబుతుండగా.. పైకి లేచిన బాలిక.. తండ్రి, సోదరుడు, తాత, మామ గురించి ఆమె చెప్పింది విని..


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.