క్రిష్ణమ్మ మృతదేహం
ఎనిమిది మందికి గాయాలు
తలుపుల, మే27: మండలంలోని పొలతలవాండ్లపల్లి సమీపంలో శుక్రవా రం వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి వృద్ధురాలు క్రిష ్ణమ్మ(50) మృతి చెందగా, మరో ఎనిమిది మంది కూలీలకు గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మరో ఆటోలో కదిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాండ్లపెంట మండలం గొడ్డువెలగల దళితవాడకు చెందిన వ్యవసాయ కూలీలు 10మంది ఆటోలో తలుపుల మండలం దేవరపల్లికు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా పొలతల వాండ్లపల్లి సమీపంలో ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రిష్ణమ్మ, చిన్నరమణమ్మ, చిన్న అంజనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మల్లికార్జున, గంగోజమ్మ, పక్కీరమ్మ, రెడ్డెమ్మ, నరసమ్మ, రత్నమ్మకు స్వల్పగాయాలయ్యాయి. ఆటోడ్రైవర్ ఆంజనేయులు కూడా స్వల్పంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వృద్ధురాలు అయిన క్రిష్ణమ్మ మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ చిన్న రమణమ్మ, చిన్న అంజనమ్మకు ప్రథమచికిత్సలు చేసి, మెరుగైన వైద్యచికిత్సల కోసం అనంతపురం తరలించారు. గాండ్లపెంట మండలం గొడ్డువెలగల దళితవాడకు చెందిన వ్యవసాయ కూలీలు ఎక్కువమంది గాయపడడంతో ఆ దళితవాడలో విషాదం అలుముకుంది. ఆటో డ్రైవర్ ఆంజనేయులపై గాయపడిన మల్లికార్జున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శరతచంద్ర తెలిపారు. క్రిష్ణమ్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు.