రూ.22కోట్లతో ఆటోనగర్‌ అభివృద్ధి

ABN , First Publish Date - 2021-07-25T05:30:00+05:30 IST

న్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఆటోనగర్‌ రూపురేఖలు మార్చి అతి త్వరలోనే సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఆటోనగర్‌ అభివృద్ధి పనులకు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు.

రూ.22కోట్లతో ఆటోనగర్‌ అభివృద్ధి
శిలాఫలకం ఆవిష్కరణలో మంత్రులు మేకపాటి, అనిల్‌ తదితరులు

ఆమంచర్లలో మినీ ఆటోనగర్‌

మంత్రులు మేకపాటి, అనిల్‌

నెల్లూరు (వెంకటేశ్వరపురం), జూలై 25 : ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని ఆటోనగర్‌ రూపురేఖలు మార్చి అతి త్వరలోనే సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఆటోనగర్‌ అభివృద్ధి పనులకు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు మాట్లాడుతూ ఆటోనగర్‌లో మౌలిక వసతుల కల్పనకు ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఈ - సీడీపీ (మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ - క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం) కింద రెండు విడతల్లో దాదాపు రూ.22 కోట్లతో రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, ప్యాచ్‌ వర్క్‌ చేపడుతున్నట్లు తెలిపారు. ఆమంచర్ల ప్రాంతంలో దాదాపు 500 ఎకరాల్లో భవిష్యత్తు అవసరాల కోసం మినీ ఆటోనగర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆటోనగర్‌ అఽబివృద్ధికి ఏపీఐఐసీ ఆధ్వర్యంలో ఒక మెయింటెనెన్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోనగర్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మంత్రులకు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌, జేసీ హరేందిర ప్రసాద్‌, కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ఏపీఐఐసీ అధికారి వైవీకే సుబ్బారావు, విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, రూరల్‌ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:30:00+05:30 IST