‘ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి’

ABN , First Publish Date - 2021-11-28T05:38:29+05:30 IST

ప్రతి ఆటో డ్రైవర్‌ నిబంధనలు పాటించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని రవాణా శాఖ సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ అన్నారు.

‘ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి’
పోస్టరు విడుదల చేస్తున్న ఎంవీఐ రాజగోపాల్‌

కర్నూలు(న్యూసిటీ), నవంబరు 27: ప్రతి ఆటో డ్రైవర్‌ నిబంధనలు పాటించి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని రవాణా శాఖ సీనియర్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌ అన్నారు.  ప్రగతిశీల ఆటో మోటార్స్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో శనివారం నంద్యాల చెక్‌పోస్టు వద్ద డ్రైవర్లకు అవగాహన సదస్సు రాష్ట్ర కార్యదర్శి తిరుపాల్‌ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం అవగాహన పోస్టరును విడుదల చేశారు. రాజగోపాల్‌ మాట్లాడుతూ డ్రైవర్లు తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. నగరంలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద నిబంధనలు పాటించాలన్నారు. ఆటో కార్మికులకు డిజిటల్‌ నెంబరు ప్లేట్లు పెండింగ్‌ ఉంటే తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కె.భాస్కర్‌, సురేష్‌నాయక్‌, అంజి, ధనుష్‌నాయక్‌, శివ, ఖాదర్‌బాషా, ఓబులేసు, సామేలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-28T05:38:29+05:30 IST