Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 25 Jan 2022 18:32:50 IST

ఆటో డ్రైవర్‌కు వివాహితతో అనుకోకుండా పరిచయం.. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ సీన్..

twitter-iconwatsapp-iconfb-icon
ఆటో డ్రైవర్‌కు వివాహితతో అనుకోకుండా పరిచయం.. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ సీన్..ప్రతీకాత్మక చిత్రం

కొన్నిసార్లు అనుకోకుండా ఏర్పడే పరిచయాలు.. అనూహ్య పరిణామాలకు దారి తీస్తుంటాయి. హద్దుల్లో ఉండే పరిచయాలైతే పర్వాలేదు గానీ... పరిధి దాటిపోయే పరిచయాల విషయంలో మాత్రం చివరకు సమస్యలు తప్పవు. ఇక పెళ్లయిన మగ, ఆడవారి మధ్య ఏర్పడే పరిచయాలు.. చివరకు ఎంతవరకు దారి తీస్తుంటాయో రోజూ చూస్తూనే ఉన్నాం. కర్ణాటకకు చెందిన ఆటో డ్రైవర్‌కు ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఓ రోజు నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరూ ఏకాంతంగా ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక హుబ్లీ జిల్లాలోని కలఘటికి తాలూకా కురివినకొప్ప గ్రామానికి చెందిన వివాహిత సమీపంలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తోంది. రోజూ పక్క గ్రామానికి చెందిన మంజునాథ్ ఆటోలో ఫ్యాక్టరీకి వెళ్లేది. వస్తూ, పోయే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. పనికి వెళ్తున్నానని చెబుతూ మంజునాథ్‌తో గడుపుతూ ఉండేది. ఈ విషయం ఆనోటా, ఈనోటా పడి.. చివరికి వివాహిత అన్న బసవరాజకు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు మంజునాథ్‌కు సూచించాడు. అయినా వారిద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు.

ప్రియుడితో కలిసి పారిపోయేందుకు భార్య ప్లాన్.. తీరా వెళ్లే క్రమంలో ఎంటరైన భర్త.. చివరకు ఇలా చేస్తాడని ఎవరూ ఊహించలేదు..

ఈ క్రమంలో ఈ నెల 18న ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి పిలిచింది. అక్కడికి వెళ్లిన మంజునాథ్‌.. ఆమెతో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండగా, సడన్‌గా షాకింగ్ సీన్ కనిపించింది. మహిళ అన్న బసవరాజు, కొందరు మనుషులు అక్కడికి వెళ్లారు. మంజునాథ్‌పై ఒక్కసారిగా తీవ్రంగా దాడి చేశారు. దీంతో అతడు.. అక్కడికక్కడే మృతి చెందాడు. చెల్లెలితో బసవరాజే ఫోన్ చేయించి పిలిపించాడని పోలీసు విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో ఉంది.

టాయిలెట్‌ నుంచి శబ్ధాలు వస్తున్నాయని పక్కింటి వారిపై కోర్టులో కేసు.. 19 ఏళ్ల తర్వాత ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

పెళ్లీ లేదూ గిల్లీ లేదు.. వ్యభిచారం చేయాల్సిందేనన్న తల్లిదండ్రులు.. వద్దంటున్నా బలవంతంగా.. ఆ గ్రామంలో ఎంతోమంది ఇలాగే..ఒక్క వీడియో కోసం కోడలి ప్రాణాన్ని తీసేసిన మామ.. ఇంతకీ ఆమె సీక్రెట్‌గా తీసిన వీడియోలో ఏముందంటే..ఆస్పత్రిలో బయటపడిన 12 పుర్రెలు, 54 ఎముకలు.. డాక్టర్‌ను నిలదీస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి..! గర్భిణిగా ఉన్న మూడో భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లిన భర్త.. డాక్టర్‌తో అతడు చెప్పిన మాట.. చివరకు ఎంతవరకు వెళ్లిందంటే.. ప్రేమికుల రోజునే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు.. ఓ రోజు టీవీ చూసి అతడు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు.. చివరకు ఏమైందంటే..తండ్రి, అన్నపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసిన బాలిక.. రెండేళ్లుగా వారు చేసిన పని తెలుసుకుని.. చివరకు..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.