Abn logo
Oct 23 2021 @ 23:36PM

అప్పుల బాధతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

ఆటోలో జీవన్‌ మృతదేహం

ఇబ్రహీంపట్నం రూరల్‌: అప్పుల భాదతో ఓ ఆటో డ్రైవర్‌ పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్న సంఘటన శనివారం కోహెడ రోడ్డులోని చర్చి రెండో గేటు వద్ద చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ జిల్లా డిండి మండలం జైత్యతండాకు చెందిన సబావత్‌ జీవన్‌(34) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్‌. 20ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరంలోని హస్తినాపురానికి వలస వచ్చి ఆటో నడుపుకుంటున్నాడు. అతడికి అప్పులు ఎక్కువై మనస్థాపానికి గురై శుక్రవారం ఉదయం ఇంటి నుంచి ఆటో తీసుకొని బయటికి వెళ్లాడు. శనివారం ఉదయం కోహెడ రోడ్డులో ఆటోలోనే పురుగుల మందు తాగి చనిపోయాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.