ఏబీఎన్ ఎఫెక్ట్: ఆటో డ్రైవర్ గోపీకృష్ణ అరెస్టు

ABN , First Publish Date - 2021-08-06T21:13:28+05:30 IST

గుంటూరులో ఓ మహిళపై ఆటో డ్రైవర్ దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది.

ఏబీఎన్ ఎఫెక్ట్: ఆటో డ్రైవర్ గోపీకృష్ణ అరెస్టు

తాడేపల్లి: గుంటూరులో ఓ మహిళపై ఆటో డ్రైవర్ దాడికి దిగిన ఘటన కలకలం రేపుతోంది. అప్పు తీర్చమన్నందుకు మహిళా అనే కనికరం లేకుండా కాలితో తన్ని తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. తాడేపల్లి మహానాడులో కొంతకాలం జీవనం సాగించిన మహిళ.. ప్రస్తుతం విజయవాడ రాణిగారి తోటలో ఉంటోంది. మహానాడులో ఉండగా తాపీ మేస్త్రీగా పనిచేసే గోపీకృష్ణకు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చింది. అప్పు తీర్చమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో ఆయనను నిలదీసింది. దీంతో ఆటో డ్రైవర్ మహిళపై దాడి చేశాడు.


ఆటో డ్రైవర్ దాడిలో మహిళకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని ఏబీఎన్ వెలుగులోకి తీసుకురావడంతో మంగళగిరి పోలీసులు వెంటనే ఆటో డ్రైవర్ గోపీకృష్ణను అరెస్టు చేసి.. మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2021-08-06T21:13:28+05:30 IST