నెల్లూరు: జిల్లాలోని సోమశిల డ్యాం సురక్షితంగా ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కురుస్తున్నా భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో సోమశిల డ్యాం ఆనకట్ట తెగిపోయినట్టు వదంతులు వ్యాపించాయి. వదంతులు నమ్మి ఇళ్లను ఖాళీ చేసి ప్రజలు వెళ్లిపోతున్నారు. కొవూరులోని బీడీకాలనీ, నేతాజీనగర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు వాస్తవ పరిస్థితిని వివరించారు. సోమశిల డ్యాం సురక్షితంగా ఉందన్నారు. ఆకతాయిల వదంతులను ప్రజలు నమ్మొద్దని అధికారులు సూచించారు.