బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABN , First Publish Date - 2020-08-09T11:06:52+05:30 IST

పట్టణంలోని బీసీ కాలనీలో బాల్య వివాహాన్ని పోలీ సులు, ఐసీడీఎస్‌ అధికారులు శనివారం అడ్డుకున్నారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

కనిగిరి, ఆగస్టు 8 : పట్టణంలోని బీసీ కాలనీలో బాల్య వివాహాన్ని పోలీ సులు,  ఐసీడీఎస్‌ అధికారులు శనివారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే బీసీ కాలనీలో 16 ఏళ్ల బాలికకు  పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుండగా సీడీ పీవో లక్ష్మీప్రసన్న, గుడ్‌హెల్ప్‌ రమేష్‌ అడ్డుకున్నారు. బాలిక తల్లిదండ్రుల కు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండాక వివాహం జరిపిస్తామని హా మీ పత్రం తీసుకున్నారు. బాల్య వివాహాలు జరిగితే 100, చైల్డ్‌లైన్‌ 1098కు సమాచారం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2020-08-09T11:06:52+05:30 IST