అడవి దున్నను కాపాడిన అధికారులు

ABN , First Publish Date - 2021-05-07T04:32:23+05:30 IST

మండలంలోని తాటిపల్లి గ్రామం వద్ద వ్యవసాయ బావిలోపడ్డ అడవి దున్నను గురు వారం అటవీశాఖాధికారులు కాపా డారు.

అడవి దున్నను కాపాడిన అధికారులు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు

కౌటాల, మే 6: మండలంలోని తాటిపల్లి గ్రామం వద్ద వ్యవసాయ బావిలోపడ్డ అడవి దున్నను గురు వారం అటవీశాఖాధికారులు కాపా డారు. పెన్‌గంగాను ఆనుకుని ఉన్న మహారాష్ట్ర అడవి నుంచి అయి దారు అడవి దున్నలు పెన్‌గంగా దాటి తెలంగాణలోకి ప్రవేశించాయి. ఒక అడవి దున్నతప్పి పోయి తాటిపల్లి గ్రామం వద్ద వ్యవసాయ బావిలో పడిపోయింది. గ్రామస్థుల ద్వారా విషయం తెలుసుకున్న అట వీశాఖాధికారులు ఎఫ్‌ఆర్వో పూర్ణ చందర్‌, డిప్యూటీ ఎఫ్‌ఆర్వో ప్రకాష్‌ ముందుగా అడవి దున్నను బయటికి తీసే ప్రయ త్నించారు. వీలుకాకపోవడంతో ఎక్స్‌కావేటర్‌, రెస్క్యూ టీం సభ్యుల సహాయంతో దున్నను బయటికి తీసి వైద్యపరీక్షలు నిర్వహించి మళ్లీ మహా రాష్ట్ర వైపు పంపించారు. ఈ సందర్భంగా అటవీ శాఖాధికారులు మాట్లాడుతూ అడవి దున్న తెలంగాణ వైపు వచ్చి నట్లు అడుగుల ద్వారా తెలిసిం దన్నారు. అడవి దున్నల ద్వారా ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని వాటికి కూడా ఎవరు హాని కలిగించ రాదన్నారు. కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌ గోపాల్‌తోపాటు రెస్క్యూ టీం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T04:32:23+05:30 IST