హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ స్టేషస్‌గా మార్పు: ఆస్ట్రియా ప్రభుత్వ నిర్ణయం

ABN , First Publish Date - 2020-06-03T20:50:25+05:30 IST

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఇంటిని పోలీస్‌ స్టేషన్‌గా మార్చేందుకు ఆస్ట్రియా దేశం సిద్ధమవుతోంది.

హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ స్టేషస్‌గా మార్పు: ఆస్ట్రియా ప్రభుత్వ నిర్ణయం

వియన్నా: జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఇంటిని పోలీస్‌ స్టేషన్‌గా మార్చేందుకు ఆస్ట్రియా దేశం సిద్ధమవుతోంది. ఇక్కడకు హిట్లర్ మద్దతు దారులు రాకపోకలను నిరోధించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మూడు అంతస్థులు ఉండే ఆ భవంతికి నూతన డిజైన్ల కోసం ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఓ పోటీని నిర్వహించింది. ఇందులో దాదాపు 11 మంది ఆర్కిటెక్టు సంస్థలు పాల్గొనగా.. మార్టే అనే సంస్థ విజేతగా నిలిచింది. హిట్లర్ ఇంటిని పోలీస్ స్టేషన్‌గా మార్చే ప్రణాళికలను ఈ సంస్థే రూపొందించింది.


కాగా.. హిట్లర్ భవంతిని పోలీస్ స్టేషన్‌గా మార్చే విషయంపై అక్కడి ప్రభుత్వం కొన్నేళ్లుగా చర్చిస్తోంది. జర్మనీ సరిహద్దుకు సమీపంలో బ్రోనోవ్ ఆన్ ఇన్ ప్రాంతంలో ఉన్న ఈ భవంతికి సంబంధించి యాజమాని ఎవరనే దానిపై గతంలో కొంత కాలం పాటు వివాదం నడిచింది.


2017లో ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం దీనికి ముగింపు పలికింది. ఈ ఇంటిని స్వాధీనం పరుచుకునేందుకు అసలు యజమాని అంగీకరించని పక్షంలో ప్రభుత్వమే దీన్ని తన ఆధీనంలోకి తీసుకుని ప్రజాహితం కోసం వినియోగించవచ్చని తీర్పు వెలువరించింది. అప్పట్లో హిట్లర్ భవంతిని కూల్చివేయాలనే ప్రతిపాదన కూడా తెరపైక వచ్చినప్పటికీ.. పోలీస్ స్టేషన్‌గా మార్చాలని ప్రభుత్వం చివరకు నిర్ణయించింది. పోలీస్‌స్టేషన్‌తో పాటూ ప్రాంతీయ కంమేండ్ కూడా ఆ భవంతిలో ఏర్పాటు చేస్తారని సమాచారం.


కాగా.. హిట్లర్ ఇంటిని పోలీస్ స్టేషన్‌గా మార్చడమే అత్యుత్తమమైన చర్య ఆస్ట్రీయా అంతర్గత వ్యవహారాల మంత్రి అభిప్రాయపడ్డారు. సామూహిక మానవహననానికి కారణమైన హిట్లర్ పుట్టిన ఇంటిలో మానహక్కులు, స్వేఛ్చకు పరిరక్షకులపై పోలీసులు స్థానం కల్పించడంకంటే సబబైన నిర్ణయం మరొకటి ఉండదని ఆయన స్పష్టం చేశారు.


ఆస్ట్రీయా ప్రభుత్వం 1972 నుంచి హిట్లర్ భవంతిని వివిధ వ్యక్తులకు అద్దెకు ఇస్తూ వస్తోంది. కొన్ని స్వచ్ఛంధ సంస్థలు కూడా కొన్నాళ్ల పాటు దీన్ని తమ కార్యాలయంగా వినియోగించుకున్నాయి. చివరిగా ఆ భవింతి ఓ వికాలాంగుల సంరక్షణాలయానికి వేదిక అయింది. 2011 నుంచి ఖాళీగానే ఉంటోంది. అయితే ఈ భవంతిని పోలీస్ స్టేషన్‌గా మర్చేందుకు రెండేళ్లు పడుతుందని, 2022 నాటికి పనులు పూర్తవుతాయని సమాచారం. ఇందు కోసం ఆస్ట్రియా ప్రభుత్వం 5 మిలియన్ డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది.

Updated Date - 2020-06-03T20:50:25+05:30 IST