మహిళ మృతి.. అస్ట్రాజెనెకా టీకా బ్యాచ్‌ను పక్కనపెట్టేసిన ఆస్ట్రియా!

ABN , First Publish Date - 2021-03-08T02:56:11+05:30 IST

ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న మహిళ మృతి చెందడంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఆ టీకా బ్యాచ్ మొత్తాన్ని వినియోగించవద్దనే నిర్ణయానికి వచ్చింది.

మహిళ మృతి.. అస్ట్రాజెనెకా టీకా బ్యాచ్‌ను పక్కనపెట్టేసిన ఆస్ట్రియా!

న్యూఢిల్లీ: ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న మహిళ మృతి చెందడంతో ఆస్ట్రియా ప్రభుత్వం ఆ టీకా బ్యాచ్ మొత్తాన్ని వినియోగించవద్దనే నిర్ణయానికి వచ్చింది. మరణానికి గల కారణాలు తెలిసేవరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని స్పస్టం చేసింది. ఆ దేశ ఆరోగ్య శాఖ ఈ మేరకు ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న అనంతరం ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. రక్తం గడ్డ కట్టుకోవడంతో సదరు మహిళ మృతి చెందినట్టు ఆ దేశ అధికారులు తెలిపారు. మరో మహిళకు ఉపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టుకోవడంతో ఆమె తీవ్రఅనారోగ్యానికి లోనయ్యారు. అయితే..ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే..వీరిలో కనిపించిన లక్షణాలకు కరోనా టీకాకు సంబంధం ఏమీ ఉండకపోవచ్చునని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. ఈ టీకా వల్ల కలిగే ప్రతికూల ఫలితాల్లో రక్తం గడ్డకట్టడం లేదని స్పష్టం చేసింది. కానీ ముందు జాగ్రత్తగా ఈ బ్యాచ్‌లో మిగిలి ఉన్న టీకాలను వినియోగించవద్దనే నిర్ణయం తీసుకున్నాం అని అక్కడి అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-08T02:56:11+05:30 IST