Australian ప్రధానమంత్రికి కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2022-03-02T12:34:40+05:30 IST

ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి స్కాట్ మారిసన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది....

Australian ప్రధానమంత్రికి కొవిడ్ పాజిటివ్

సిడ్నీ: ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌కు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. స్కాట్ మారిసన్‌ ఫ్లూ లక్షణాలు, జ్వరంతో బాధపడుతుండటంతో అతనికి మంగళవారం రాత్రి పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ‘‘నేను కరోనాతో సిడ్నీ నగరంలోని ఇంట్లో ఐసోలేషన్ లో ఉండి, కొవిడ్ మార్గదర్శకాలు, ఆరోగ్య నిబంధనలు పాటిస్తున్నాను’’ అంటూ స్కాట్ మోరిసన్ మంగళవారం అర్దరాత్రి ఓ ప్రకటన జారీ చేశారు.ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధంతోపాటు వరదల నేపథ్యంలో తాను ఐసోలేషన్ లో ఉండి విధులు నిర్వర్తిస్తున్నానని ప్రధానమంత్రి మోరిసన్ చెప్పారు.ఉక్రెయిన్ దేశానికి మద్ధతుగా ఆస్ట్రేలియా ఓ కార్యక్రమం చేపట్టినా, కరోనా వచ్చిన ప్రధాని గైర్హాజరు అయ్యారు. కరోనా సోకిన స్కాట్ సిడ్నీ నగరంలోని ఒపెరా హౌస్ లో మంగళవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి హాజరుకాలేదు.


Updated Date - 2022-03-02T12:34:40+05:30 IST