నోవాక్ జకోవిచ్ వీసా రద్దు...Australian Government సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2022-01-06T13:39:19+05:30 IST

సెర్బియా టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ అధికారులు రద్దు చేశారు....

నోవాక్ జకోవిచ్ వీసా రద్దు...Australian Government సంచలన నిర్ణయం

మెల్ బోర్న్: సెర్బియా టెన్నిస్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ వీసాను ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ అధికారులు రద్దు చేశారు. జకోవిచ్ బుధవారం అర్దరాత్రి మెల్ బోర్న్ కు చేరుకున్న తర్వాత అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జకోవిచ్ కు అనుమతి లభించడంతోపాటు వైద్యపరమైన మినహాయింపు పొందాడు.అయితే జకోవిచ్ వీసాను రద్దు చేవామని,కొవిడ్ నిబంధనలకు ఎవరూ అతీతులు కారని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్ ట్వీట్ చేశారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయకుండా వైద్యపరంగా మినహాయింపు ఉందని నిరూపించలేకపోతే నోవాక్‌ను దేశం నుంచి తదుపరి విమానంలో పంపుతామని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి హెచ్చరించారు.


ఆస్ట్రేలియాలో ప్రవేశానికి జొకోవిచ్ తగిన సాక్ష్యాలు అందించడంలో విఫలమయ్యాడని, అందుకే అతని వీసాను రద్దు చేశామని ఆస్ట్రేలియా వివరించింది.కాగా మెల్‌బోర్న్‌లోని తుల్లామరైన్ ఎయిర్‌పోర్ట్‌లో తన కుమారుడిని గంటల తరబడి నిర్బంధించి, మినహాయింపు గురించి ప్రశ్నించడంపై జొకోవిచ్ తండ్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-01-06T13:39:19+05:30 IST