ఫించ్‌ వైఫల్యం.. భార్యకు బెదిరింపులు

ABN , First Publish Date - 2021-02-28T09:23:47+05:30 IST

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో విఫలమైన అతడు.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీ్‌సలోనూ పెద్దగా రాణించడం లేదు...

ఫించ్‌ వైఫల్యం.. భార్యకు బెదిరింపులు

సిడ్నీ: ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో విఫలమైన అతడు.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీ్‌సలోనూ పెద్దగా రాణించడం లేదు. ఫించ్‌ ఆడకపోవడమేమో కానీ.. అతడి భార్య అమీకి ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయి. ఇటీవలి కాలంలో ఆమెపై దాడి చేస్తామని బెదిరించడమే కాకుండా లైంగిక వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. ‘నీ భర్తను కెప్టెన్సీ వదిలేయమను. అతడి కారణంగా చాలా డబ్బు నష్టపోయా’ అని బెదిరించడంతోపాటు దుర్భాషలాడుతూ ఓ వ్యక్తి చేసిన పోస్టును అమీ ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 


Updated Date - 2021-02-28T09:23:47+05:30 IST