కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా: ఆరోన్ ఫించ్

ABN , First Publish Date - 2020-08-07T03:33:45+05:30 IST

ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న

కోహ్లీ సారథ్యంలో ఆడేందుకు ఎదురుచూస్తున్నా: ఆరోన్ ఫించ్

కాన్‌బెర్రా: ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నానంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. క్రికెట్ అభిమానులంతా ఎదురుచూస్తున్న ఐపీఎల్ కేవలం ఒక్క నెల దూరంలోనే ఉంది. దీని కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో, ఆటగాళ్లు కూడా ఇందులో ఆడేందుకు అంతకుమించి ఆసక్తిగా ఉన్నారు. దీనికి ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యాఖ్యలు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫించ్ ఆర్‌సీబీ తరుపున బరిలోకి దిగేందుకు వేచిచూస్తున్నాని చెప్పాడు. ‘ఎందరో గొప్ప ప్లేయర్స్‌తో కూడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగూలూర్ జట్టుకు ఆడటం సంతోషంగా ఉంది. సొంత ప్రేక్షకుల మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఆడటం ఎంతో గొప్పగా ఉంటుంది. అయితే ఈ ఏడాది టోర్నీ యూఏఈలో జరగనుంది. అయినప్పటికీ బెంగళూరు తరుపున ఆడటం సంతోషంగానే ఉంది. ప్రపంచ మేటి ఆటగాళ్లతో కలిసి ఆడటం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీతో కలిసి ఒకే జట్టులో ఆడటం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకూ కోహ్లీకి ప్రత్యర్థిగానే ఆడాను. తొలిసారి అతడి సారథ్యంలో ఆడటం బాగుటుందనుకుంటున్నాను. నేను ఆడిన కెప్టన్లందరిలోకి కోహ్లీనే కుర్రాడు. అంతేకాకుండా జట్టుకు కుదిరినన్ని విధాలుగా సాహాయం చేయడానికి వెనుకాడను. కోహ్లీకి కెప్టెన్సీలో భారం తగ్గించేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తాన’ని ఆరోన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ మొదలయ్యి ఇప్పటికే 12 సిరీస్‌లు పూర్తయ్యాయి. అయినా ఒక్కసారి కూడా ఆర్‌సీబీ విజేతగా నిలువలేదు. ఈసారైనా తన అనుభవాన్ని ఉపయోగించి ఏమైనా మార్పు తీసుకురావడాని ప్రయత్నిస్తానని ఫించ్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-07T03:33:45+05:30 IST