T20 World Cup Final : కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2021-11-15T00:42:14+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య

T20 World Cup Final : కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది.


సెమీస్‌లో పాకిస్థాన్‌ను మట్టి కరిపించిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నట్టు ఆసీస్ కెప్టెన్ అరోన్ ఫించ్ పేర్కొన్నాడు. ఆడం జంపా అద్భుతంగా రాణిస్తున్నాడని, ఈ మ్యాచ్‌లోనూ అది కొనసాగుతుందని ఫించ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. గత రికార్డులతో పనిలేదని, ఈ మ్యాచ్‌లో కివీస్‌ను మట్టి కరిపిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.


న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ప్రత్యర్థి ముందు ఘనమైన లక్ష్యాన్ని ఉంచి సవాలు విసిరేందుకు ప్రయత్నిస్తామన్నాడు. తాము ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్నామని, కాన్వే స్థానంలో సీఫెర్ట్ జట్టులోకి వచ్చినట్టు చెప్పాడు. 

Updated Date - 2021-11-15T00:42:14+05:30 IST