భారతీయ యోగా మాస్టర్లు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా అదిరిపోయే ఆఫర్!

ABN , First Publish Date - 2022-04-06T17:02:20+05:30 IST

భారత యోగా శిక్షకులు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి డాన్ తెహాన్‌ మీడియాకు తెలిపారు. ఇటీవల భారత్, ఆసీస్ మధ్య కుదిరిన ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్‌ అండ్‌..

భారతీయ యోగా మాస్టర్లు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా అదిరిపోయే ఆఫర్!

ఎన్నారై డెస్క్: భారత యోగా శిక్షకులు, చెఫ్‌లకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. ఈ రెండు రంగాలకు చెందిన వారిని ప్రత్యేకంగా పరిగణిస్తూ వీసాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ వాణిజ్య, పర్యాటక శాఖ మంత్రి డాన్ తెహాన్‌ మీడియాకు తెలిపారు. ఇటీవల భారత్, ఆసీస్ మధ్య కుదిరిన ఆస్ట్రేలియా ఇండియా ఎకనామిక్‌ అండ్‌ ట్రేడ్‌ అగ్రిమెంట్‌(ఏఐఈసీటీఏ) వాణిజ్య ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. "ఈ వాణిజ్య ఒప్పందం కీలక ఫలితాలలో మొబిలిటీ ఒకటి. దీనిలో భాగంగా భారతీయ చెఫ్‌లు, యోగా శిక్షకులకు ప్రత్యేక వీసా ఏర్పాట్లకు మేము అంగీకరించాము" అని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.


ఇరు దేశాల మధ్య రాకపోకలు పెరిగినప్పుడే ఏఐఈసీటీఏ ప్రయోజనాలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు. ఇక త్వరలోనే ఈ వీసాల జారీకి సంబంధించిన నియమ నిబంధనలు ప్రకటిస్తామని మంత్రి తెలియజేశారు. అలాగే భారతీయ బ్యాక్‌ప్యాకర్లకు ఆస్ట్రేలియా 1,000 వర్కింగ్ హాలిడే వీసాలు కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక అగ్రశ్రేణి భారతీయ ఐటీ, ఇంజనీరింగ్, గణితం, సైన్స్ గ్రాడ్యుయేట్‌లకు సుదీర్ఘ పోస్ట్-స్టడీ వీసాలను కూడా జారీ చేస్తామన్నారు. కాగా, ఇప్పటి వరకు వంట మాస్టర్లు, యోగా గురువులకు స్కిల్డ్ పర్సన్స్‌ కోటాలోనే ఆస్ట్రేలియా వీసాలు జారీ చేస్తోంది. దీని వల్ల వీసాలు లభించడానికి చాలా సమయం పడుతోంది. 

Updated Date - 2022-04-06T17:02:20+05:30 IST